వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులు

వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులు
January 31 12:36 2019

గుంటూరు జిల్లాలో  ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నుంచి పంట చేతికి వచ్చే వరకూ రైతులు ఎదో ఒక సమస్యతో సతమతం అవుతూనే ఉన్నారు.  రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా చేతికి అందివచ్చిన మిర్చి పంట నాణ్యత కోల్పోతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ ఏడాది ఆదిలో బొబ్బర తెగులు, ఆ తరువాత వర్షాభావంతో పంట ఎదుగుదల లేక దిగుబడి తగ్గింది. అంతేగాక మిర్చి యార్డులో విక్రయానికి తీసుకువచ్చిన మిర్చి ధర తగ్గి రైతులు నష్టపోతున్నారు. తాజాగా కురుస్తున్న వర్షాలతో రైతుల మరింత ఆందోళన చెరదుతున్నారు. కల్లాలో ఉన్న మిర్చిని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఆకాశం మేఘా వృత్తం అయి ఉండటం, ఏ క్షణాన వర్షం పడుతుందో తెలియని పరిస్థితిలో ఆరబోసిన మిర్చి వద్ద కాపాల కాస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డులో విక్రయానికి తీసుకువచ్చిన మిర్చి తడిసిపోవడంతో, తేమ పెరగడంతో ఆరబోసి ఎండబెడుతున్నారు. మళ్లీ వర్షం వస్తుందనే భయంతో అక్కడే కాపలాగా పడుకుని పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా జల్లులతో కూడిన ఒక మోస్తరుగా వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఉదయానికి కురిసిన వర్షంపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అచ్చంపేట 37.6, రెంట చింతల 34.2, మాచర్ల 32.6,దాచేపల్లి 22.4, పిడుగురాళ్ల 20.8,దుర్గి 20.4, గురజాల 19.6,సత్తెనపల్లి 19.2, బెల్లంకొండ 18.2, క్రోసూరు 17.8, బొల్లాపల్లి 17,అమరావతి 16.6, వెల్దుర్తి 14.6, రాజుపాలెం 12.4,తాడికొండ 12.4, మాచవరం 10.8, తుళ్లూరు 10.6, మేడికొండూరు 10.6, పెదకూరపాడు 10.2 వర్షపాతం నమోదు అయింది. మిగిలిన ప్రాంతాల్లో జల్లులతో కూడిన ఒక మోస్తరు వర్షం కురిసింది. రెంటచింతలలో 34.2 మిల్లీ మీటర్ల వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోలిగ్రామంలోని గోలివాగుపై పట్టాపై నీరు ఉదృతంగా ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయ్యాయి. పలు ప్రాంతాల్లో పత్తి తడిసి పోయి ఎందుకు పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. డెల్టాలోని కొల్లూరు, భట్టిప్రోలు ప్రాంతంలో ఇసుకు బట్టిల్లో ఇటుకలు దెబ్బతింటున్నాయి. డెల్టాలోని వరిసాగు చేసిన రైతులు కొన్ని చోట్ల నూర్పిడికి సిద్దం కాగా వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు. వరి అనంతరం అపరాలు, జొన్న, మొక్కజొన్న పైరు ఇప్పుడిప్పుడే లేత దశలో తేమ నుండి మొక్క పెథారు తుపాను కారణంగా సాగు ఆలస్యం కావడంతో మొక్క ఇప్పుడిప్పుడే లేత దశ నుండి కోలుకుంటుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ భూమి తేమగానే ఉండి మొక్కలు జిగటబారి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులను మరింత నష్టపరిచే పరిస్థితి కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24432
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author