పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మోసం

పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు మోసం
February 04 13:28 2019

చంద్రబాబు వేషాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు తన ఇంట్లో ఆడపడుచులనే మోసం చేసిన వ్యక్తి. అమ్మణ్ణమ్మ ఆస్దిని తన సోదరీమణులకు ఇవ్వకుండా లోకేష్ పేరుతో రాసుకున్నారని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మణ్ణమ్మ ఆస్ది నారా లోకేష్ కు ఎలా ఇస్తారు. మహిళల తాలిబొట్లు తెంపేసేలా చంద్రబాబు పాలన సాగింది. ఇప్పుడు పసుపు కుంకుమపేరుతో మోసం చేస్తున్నారు. -చంద్రబాబు పాలనలో మహిళలను మోసం చేశారు. 2104లో డ్వాక్రామహిళలు రుణాలన్నింటిని మాఫి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. 14,200 కోట్లు ఉండే వారి రుణాలు 22 వేల కోట్లుకు చేరుకున్నాయి. అంటే చంద్రబాబు చేసిన మోసంతో వడ్డీ కలిపి డ్వాక్రారుణాలు వేలకోట్లకు పెరిగి పోయాయని అన్నారు. డ్వాక్రామహిళల రుణాలు మాఫి చేసిఉంటే వారు అప్పుల పాలయ్యేవారు కాదు. చంద్రబాబుకు మళ్లీ ఓటు వేస్తే మహిళలు కడుపు మాడ్చుకోవాల్సిందే. డ్వాక్రామహిళ విభాగానికి మంత్రి అయి ఉండి పోలీసులు లేకుండా వారి మధ్యకు వెళ్లగలవా? -బ్యాంకులనుంచి బంగారం మీ ఇంటికి వచ్చేస్తుందంటూ చెప్పి మోసం చేసింది నిజం కాదా? -చంద్రబాబుతో చెప్పి డ్వాక్రా రుణాలు మాఫి చేయించే సత్తా నీకుందా పరిటాల సునీత అని ప్రశ్నించారు. పరిటాల సునీత మంత్రిగా ఉండటం మహిళలకు సిగ్గుచేటు. మహిళల తాళిబొట్లపై ఒట్టేయించుకుని టిడిపికే ఓటు వేయాలని సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు. ఈ విషయంపై మహిళలను చైతన్యం చేయాలని ప్రశ్నిస్తే ఎంఎల్ ఏ  చెవిరెడ్డిపై దాడి చేశారు.  రెండు సంవత్సరాలుగా వడ్డీలేని రుణాలు ఇవ్వకుండా మోసం చేశారు. ఇన్ని రోజులు మీ కోసం కష్టపడ్డాను ఈ 75 రోజులు నా కోసం కష్టపడండి అంటూ చంద్రబాబు అంటున్నాడు. అసలు నీకెందుకు ఓట్లేయాలి. కాల్ మని సెక్స్ రాకెట్ లో నిందితులను కాపాడినందుకా. వనజాక్షిని జుట్టుపట్టుకుని కొడితే మీ ఎంఎల్ ఏను కాపాడినందుకా. .నారాయణా కాలేజిలో విద్యార్దునులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం విచారణ చేయించకుండా నారాయణను కాపాడుతున్నందుకా  ప్రతి ఊరికి ఓ బారు బెల్ట్ షాపులు పెట్టినందుకు ఓట్లేయాలా అని నిలదీసారు. చంద్రబాబు ఇచ్చింది మహిళలకు మూడే మూడు బెల్ట్ షాపుల రద్దు. ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తాను. డ్వాక్రామహిళలకు రుణాల రద్దు. వీటిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఫెయిల్ అయ్యారని ఆరో్పించారు. టిడిపి ఎంఎల్ ఏలు నేతలు కార్యకర్తల అండదండలతో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నందుకు ఓట్లేయా3లా? మహిళలకు చేసిన అన్ని వాగ్దానాలు అమలు చేసిన తర్వాత చంద్రబాబుకు ఓట్లేయాలి కాని. నాడు మీ తాళిబొట్లు తెంచేసినందుకు. మిమ్మల్ని అప్పులపాలు చేసినందుకు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్పాలి.ఆయన పాలనకు పుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. ఈ పోస్ట్ డేటెడ్ చెక్కులు విషయంలో కూడా చంద్రబాబు మోసం చేస్తాడు. ఇది ఎన్నికల స్టంట్. స్పెషల్ స్టేటెస్ విషయంలో శ్రీ జగన్ నల్లచొక్కాలు ధరిస్తే అలా అసెంబ్లీకి రాకూడదని చెప్పిన చంద్రబాబు నేడు అదే జగన్ ను అనుసరించాల్సివచ్చింది. చంద్రబాబుది నరకాసురిడి పాలన.పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసపోవద్దని మహిళలకు విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రబాబు చేసిన రుణాల మాఫి వాగ్దానాన్ని అమలు చేసిన తర్వాతనే గ్రామాలలోకి రావాలని లేదంటే తరమికొట్టే పరిస్తితులు నేడున్నాయి. మద్యనిషేధం చేస్తానని,పిల్లలను బడికి పంపితే ప్రతి మహిళకు ఆర్దికభరోసా కల్పిస్తానని చెప్పిన జగన్ కు మధ్దతు పలకండి.మాటమీద నిలబడే జగన్ ను నమ్మండని ఆమె అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24563
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author