యాదాద్రిలో మరో యాగం

యాదాద్రిలో మరో యాగం
February 05 10:44 2019

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల సహస్ర చండీ యాగం నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్..మరో యాగానికి సిద్ధమవుతున్నారు. యాదాద్రి ఆలయ పనరుద్ధరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన..పనులు పూర్తైన తర్వాత 11 రోజుల పాటు సహస్రాష్టక కుండయాగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 1,008 యాగ కుండలతో నిర్వహించే అతిపెద్ద యాగానికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లతో పాటు దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని తెలిపారు.అత్యాధునికంగా, ఆధ్మాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్ లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని సిఎం అధికారులను కోరారు. దేశంలోని ప్రతీ ఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు.ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత ఆలయ శిల్ప కళా నైపుణ్యంతో, ఆలయ ప్రాశస్త్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరగాలి. వందల ఏళ్ల పాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతీ అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పునరుద్ధరణ తర్వాత యాదాద్రికి భక్తుల సంఖ్య ఎన్నో రెట్లు పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. గుట్ట కింది భాగంలో గండి చెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటి సరఫరా చేస్తామని వెల్లడించారు. గండి చెరువుకు అనుబంధంగా కోనేరు, కళ్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కింద భాగంలోనే ఆలయ బస్టాండ్ నిర్మించాలని, అక్కడి నుంచి భక్తులను దేవాలయ వాహనాల ద్వారా గుట్టపైకి తీసుకురావాలని చెప్పారు. గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు ఉపయోగించాలని చెప్పారు. గుట్ట కింద మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగు రోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్లు వేయాలని ఆదేశించారు.నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని కోరారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్లు చెప్పారు. భక్తులు భస చేయడానికి వీలుగా టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరగాలని చెప్పారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజి లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతీ బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని సిఎం చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటేన్లు నిర్మించాలని సూచించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24617
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author