రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
February 07 14:13 2019

కర్నూలు జిల్లా ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డు ప్రమాదం జరిగింది. కారును, లారీ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వైకాపా కార్యకర్తలు మృతిచెందారు. కడపలో జగన్ సభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.  కేంద్ర మాజీ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తలంపుతో, తన అనుచరులతో కలిసి భారీ కాన్వాయ్ తో వెళుతున్న వేళ ఈ ఘటన జరిగింది. మృతులు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి అనుచరులుగా గుర్తించారు. వీరంతా  గూడూరు, బెలగల్ నుంచి కార్యకర్తలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరణించిన వారిలో కర్నూలుకు చెందిన చిన్న రాముడు, బోటు రాముడు, డ్రైవర్ రాఘవేంద్ర ఉన్నారు. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24772
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author