అంతరించిపోతున్న గొల్లభామ చీరలను వెలుగులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం

అంతరించిపోతున్న గొల్లభామ చీరలను వెలుగులోకి తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం
February 07 15:45 2019

జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో గొల్లభామ  చీరలు నేసేందుకు ఆధునిక జాకార్ట్ మగ్గాలు, శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు, చేనేత జౌళిశాఖ సంచాలకులు  శైలజ రామయ్యర్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సు, హాండ్ల్యూమ్ ఏడీ రమణ, హాండ్ల్యూమ్ అధికారిక సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మేరకు చేనేత కార్మికుడికి శ్రమ తగ్గించి సమయాన్ని మిగల్చడంతో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా రూపుదిద్దిన జాకార్ట్ మగ్గాలను శైలజ రామయ్యర్, క్రిష్ణ భాస్కర్ లతో కలిసి వాటి పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా జరిగిన సభ సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ అంతరించిపోతున్న గొల్లభామ చీరలను వెలుగులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. ఉపాధి దొరికే పరిస్థితి లేక., ఉమ్మడి రాష్ట్రంలోని గత పాలకులు చేనేత కార్మికుల గురించి పట్టించుకోకపోవడంతో ఎంతో మంది చేనేతల ఆత్మహత్యలు జరిగాయని. చేనేత వృత్తి అంతరించి పోయిందన్నారు.  గత పాలకుల పుణ్యం వల్లనే చేనేత కార్మికులకు ఏమి జరగలేదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికులకు కొత్త వెలుగులు అందించారన్నారు.ప్రతి సోమవారం ప్రతి అధికారి చేనేత వస్త్రాలను ధరించాలని, ఆ గౌరవాన్ని తీసుకొచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. హాండ్ల్యూమ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి చేనేత కార్మికులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని గుర్తుచేశారు. 575మంది చేనేత కార్మికులకు కోటి39 లక్షలు రూపాయల రుణమాఫీ చేశామన్నారు.  ఇవాళ 20లక్షల రూపాయలతో 22 జాకార్ట్ మగ్గాలను ఏర్పాటు చేశామన్నారు. గతంలో గొల్లభామ చీరను నేయాలంటే.. 3 రోజులు సమయం పట్టేదని, జాకార్ట్ మగ్గాల ద్వారా 1/2 రోజులో ఒక చీరను నేయవచ్చని వివరిస్తూ.. గతంలో ఒక్క చీర నేస్తే 3 రోజులకు 5వేల రూపాయలు వచ్చేవి. కానీ ఇవాళ ఈ జాకార్ట్ మగ్గం నేయడంతో 3 రోజుల్లో 15వేల రూపాయలు చేనేత కార్మికుడికి గిట్టుబాటు లభిస్తుందన్నారు.  జాకార్ట్ మగ్గాలతో చేనేత కార్మికుల కూలీ మూడింతలు రెట్టింపు అయిందన్నారు.సిద్ధిపేట చేనేత సహకార సంఘ పరిధిలో 22 జాకార్ట్ మగ్గాలను తీసుకొచ్చామన్నారు.  సూరత్, బొంబాయి ప్రాంతాలకు వలసలు వెళ్లిన చేనేత కార్మికులు వాపస్ తిరిగొస్తారని.. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో వరంగల్, సిరిసిల్లా జిల్లాలో మెగా టెక్స్ టైల్స్ రానున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకుల చేతగాని తనం వల్లనే ఉపాధి లేక వృత్తి రీత్యా అనుకున్న పని లేక చేనేత కార్మిక మహిళలు బీడీ కార్మికులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు.  కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక చేనేత పరిశ్రమలు బ్రహ్మండంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.రానున్న రోజుల్లో ప్రభుత్వం నుంచి రూ.1000 ఫింఛను త్వరలోనే రూ.2016కు పెంచుతామన్నారు.చేనేత కార్మికులకు రసాయనాలు, నూలు పై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామన్నారు. త్వరలోనే ప్రయోగాత్మకంగా సిద్ధిపేటలో పెడల్ లూమ్ ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తామని తెలిపారు.. పెడల్ లూమ్ ద్వారా మంచి వస్త్రాలను తయారు చేయవచ్చని., ప్రయోగాత్మకంగా చేపట్టే కార్యక్రమానికి సిద్ధిపేట నుంచి 25 నుంచి 30 మందిని కోయంబత్తూరుకు వెళ్లి శిక్షణ పొందేలా నేర్చుకుని పంపుదామని నిర్ణయించినట్లు హరీశ్ పేర్కోన్నారు.  మహిళలకు స్వయం ఉపాధి లభించేలా వారు వృద్ధి చెందేలా కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  టెస్కో ద్వారా చేనేత కార్మికులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని శైలజ రామయ్యర్ ను కోరారు.  సిద్ధిపేట గోల్కొండ షోరూమ్, రైతుబజారు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లలో చేనేత స్టాల్ ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత సహకార సంఘాలలోని కార్మికులకు రావాల్సన రూ.3.80కోట్ల రూపాయల త్రిఫ్ట్ నిధులు మంజూరైనట్లు వాటిని కార్మికులకు అందజేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24789
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author