తెలంగాణ నుంచే రైతు బంధు

తెలంగాణ నుంచే రైతు బంధు
February 07 17:11 2019

తెలంగాణలో అమలుచేస్తున్న ‘రైతు బంధు’ పథకం తరహాలో.. రైతులకు పంట సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకేఎస్‌ఎన్)’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకాన్ని తెలంగాణ నుంచే అమలుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ‘రైతుబంధు’ పథకం అమలు చేస్తున్నందున.. ఈ పథకం అమలు ఇక్కడి నుంచి సులభమవుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయశాఖ అధికారులు తెలంగాణ ప్రభుత్వం నుంచి రైతుల సమాచారం కోరారు. 2019 బడ్జెట్‌లో ‘కిసాన్ సమ్మాన్’ పథకం కోసం రూ.75,000 కోట్ల నిధులను కూడా కేటాయించారు. పథకం కింద 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున జమ చేయనున్నారు. 2018 డిసెంబర్ నుంచే ఈ పథకం వర్తిస్తుందని పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో చదివిన సంగతి తెలిసిందే. అంటే, 2018-19 ఆర్థిక సంవత్సరానికే ‘రైతుకు ఆర్థిక మద్దతు’ కింద ప్రభుత్వం రూ.20,000 కోట్ల ఖర్చు చేయనుంది.ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందనున్నారు. కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతుకు ఏడాదికి 8,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తోంది. సీజన్‌కు ఎకరాకు 4 వేల రూపాయల చొప్పున ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ. 8,000 చెల్లిస్తున్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.10,000 ఇవ్వనున్నారు. పథకానికి మార్గదర్శకాలివే.. * 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకే ఈ పథకం వర్తిస్తుంది. * కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం వర్తించదు. * నాలుగో తరగతి ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. * ఆదాయపు పన్ను కట్టే వారికి పంటసాయం అందదు. * ఎమ్మేల్యే, ఎంపీలు, మంత్రులు, మాజీ ప్రజాప్రతినిధులకు ఈ పథకం వర్తించదు. * రైతు ధ్రువీకరణ తప్పనిసరి. * తప్పుడు పత్రాలతో సాయం పొందినవారిపై చట్టరీత్యా చర్యలుంటాయి.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24801
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author