మతి స్థిమితం కోల్పోయిన రాహుల్‌ గాంధీ:బిజెపి

మతి స్థిమితం కోల్పోయిన రాహుల్‌ గాంధీ:బిజెపి
February 08 17:14 2019

రాహుల్‌ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని భాజపా ఆరోపించింది. రఫేల్‌ విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై రాహుల్‌ చేస్తున్న ఆరోపణలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. అసత్యాలు పదే పదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కాబోవని స్పష్టం చేసింది. ‘‘రఫేల్‌పై రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ఇస్తూ వివరణ ఇచ్చారు. రాహుల్‌ మాత్రం కావాలనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మోదీని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన రఫేల్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు’’ అని భాజపా నేతలు మండిపడ్డారు.అంతకుముందు ఈ ఉదయం మీడియా సమావేశంలో రాహుల్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రఫేల్‌ ఒప్పందంపై ప్రధాని మోదీ రూ.30వేల కోట్లను అనిల్‌ అంబానీకి దోచిపెట్టారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. రఫేల్‌పై కేంద్రం సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=24891
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author