ఎన్నికల బరిలోకి హరీష్ రావు భార్య శ్రీనిత తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైన సోషల్ మీడియా పోస్టు

ఎన్నికల బరిలోకి హరీష్ రావు భార్య శ్రీనిత  తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైన సోషల్ మీడియా పోస్టు
February 11 16:47 2019

కేసీఆర్ అన్న కూతురు, టిపిసిసి అధికార ప్రతినిధి రమ్యారావు సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. త్వరలోనే సిద్దిపేటకు ఉప ఎన్నికలు జరుగుతాయని ఆ ఎన్నికల్లో హరీష్ రావు భార్య శ్రీనిత బరిలోకి దిగుతారని ఉంది. కాంగ్రెస్ కు చెందిన వాట్పాప్ గ్రూప్ లో తాజా తెలంగాణ పేరుతో ఆమె పోస్టు చేశారు. “మరో 4 నెలల్లో సిద్దిపేటకు బై ఎలక్షన్స్ జరుగుతాయి. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా తన్నీరు హారీష్ రావు భార్య తన్నీరు శ్రీనిత పోటి చేస్తారు. హారీష్ రావును పార్లమెంటుకు పంపాలని కేసీఆర్ భావిస్తున్నారు.” అని ఆమె వాట్పాప్ లో పోస్టు చేశారు. గత కొంత కాలంగా హరీష్ రావును కేసీఆర్ పార్లమెంటుకు పంపిస్తారని వస్తున్న వార్తలకు రమ్యరావు పోస్టు బలం చేకూర్చినట్టయ్యింది. దీంతో తెలంగాణలో కొత్త చర్చ ప్రారంభమయ్యింది.గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ కు , హరీష్ రావుకు మధ్య దూరం పెరిగిందని వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే కేటిఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి హారీష్ రావు పరపతిని తగ్గించారని పార్టీలో చర్చ జరిగింది. అదే విధంగా గత కొంత కాలంగా మంత్రివర్గంలో హారీష్ రావును తీసుకోరని కూడా చర్చ జరుగుతోంది. కేటిఆర్ కు మంత్రి పదవి ఇచ్చి హారీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వకుంటే ప్రజల్లోకి తప్పుడు భావనలు వెళ్తాయని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ప్రణాళికా ప్రకారం పార్లమెంటు ఎన్నికల ప్రకారం మంత్రివర్గంలో వీరిద్దరికి అవకాశం కల్పించవద్దని నిర్ణయించారని తెలుస్తోంది.హారీష్ రావును పార్లమెంటుకు పంపించి ఢిల్లీ రాజకీయాలకు పరిమితం చేయాలని, కేటిఆర్ కు పూర్తిగా రాష్ట్రరాజకీయాలు అప్పగించే యోచలనో కేసీఆర్ ఉన్నారని నేతలు అంటున్నారు. ఫెడరల్ ఫ్రంట్ తో దేశ రాజకీయాలను మార్చాలని కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన పలు రాష్ట్రాలు పర్యటించి వివిధ పార్టీల నేతలతో చర్చించారు. కానీ అది ఇంత వరకు ఆచరణలో ముందడుగు పడలేదు. దీంతో కేసీఆర్ కాస్త  నిశ్శబ్దమయ్యారు. అటు రాష్ట్రంలోనూ బడ్డెట్ సమావేశాలు, మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలకు పరిమితం అయ్యారు. త్వరలోనే ఆయన మళ్లీ దేశవాళీ రాజకీయాల పై దృష్టిపెట్టనున్నట్టు తెలుస్తోంది.తెలంగాణలో ప్రస్తుతం సైలెన్స్ గా ఉన్న రాజకీయాలలో ఒక్కసారిగా రమ్యారావు పోస్టు హీట్ ను పెంచింది. తెలంగాణలో హారీష్ రావు ప్రాముఖ్యత తగ్గించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న వాదనకు బలం చేకూరేలా రమ్యారావు మెసేజ్ ఉందని పలువురు నేతలు అన్నారు. దీంతో నిజంగానే సిద్దిపేటకు ఉపఎన్నికలు రాబోతున్నాయా లేక ఈ లోపు కేసీఆర్ ఏమైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారా అనేది చర్చనీయాంశమైంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25072
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author