ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్

ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్
February 12 16:30 2019

హైదరాబాద్‌ బండ్లగూడలోని పెబెల్ సిటీ నివాస సముదాయంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలుడు ఆడుకుంటుండగా కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగినట్టు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు ప్రకటించారు.  ఏ ఒక్కరూ చూసి స్పందించిన బాలుడు బతికేవాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు విచారణ చేపట్టారు. పార్కులో అలంకరణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అయితే మృతి చెందిన బాలుడి తండ్రి, సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అని వారు చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. బాలుడిని మృతదేహాన్ని కూడా అక్కడికి తరలించినట్లు సమాచారం. అయితే కనీసం బయట వ్యక్తులను కూడా అనుమతించిన పీబీఈఎల్ భద్రతా సిబ్బంది‌.. బాలుడి పట్ల ఇంత నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇక  ఈ పెబెల్‌ సిటీలో సుమారు 1300 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ ఘటనతో ఈ నివాస సముదాయంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది.అయితే, పెబెల్ సీటీలో్ బాలుడు మూసీన్ విద్యుత్ షాక్‌తో మృతి చెందడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెబెల్ సిటీ సొసైటీ సభ్యులు విద్యుత్ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25139
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author