సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి

సంగారెడ్డి ప్రజలకు హరీష్ రావు క్షమాపణ చెప్పాలి
February 13 15:54 2019

తెరాస  నేత హరీష్ రావు పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగూరు నీటిని దోపిడీ చేసి సంగారెడ్డి ప్రజల గొంతులు ఎండబెట్టారని విమర్శించారు. కేటాయింపులు లేకున్నా శ్రీరాంసాగర్ కు నీటిని తరలించారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడనే కారణంతో అధికారులు కూడా అడ్డు చెప్పలేదన్నారు. నీటి తరలింపు విషయం కేసీఆర్కు తెలిస్తే ఆయన ఒప్పుకునే వారు కాదన్నారు. కేసీఆర్ కు చెడ్డపేరు తెచ్చే ఈ నిర్ణయం వెనుక.. హరీష్ రాజకీయ కోణం ఉందనే అనుమానం ఉందని, ఇవన్నీ అడుగుతాననే హరీష్ తనను ఓడించాలని చూశారని జగ్గారెడ్డి ఆరోపించారు. హరీష్ రావు సంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25185
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author