మార్కెట్లో మోడీ చీరలు

మార్కెట్లో మోడీ చీరలు
February 13 17:56 2019

ప్రధాని మోదీ మేనియా మామూలుగా లేదండోయ్. మొన్నటి వరకు మోదీ టీ-షర్టులు, కీ చైన్లు, వెడ్డింగ్ కార్డులకు పరిమితమైన క్రేజ్ ఇప్పుడు చీరలకు కూడా పాకింది. గుజరాత్‌లో ఏకంగా ‘మోదీ చీరలు’మార్కెట్‌లోకి వచ్చాయి. సరిగ్గా ఎన్నికలకు ముందు సూరత్‌లో ఈ చీరల సీజన్ మొదలయ్యింది.మోదీ చిత్రాలతో ఉన్న చీరలు అలా వచ్చాయో లేదో.. ఇలా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయట.సూరత్ మార్కెట్‌లో నాలుగు రకాల చీరలు.. వివిధ రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ‘మోదీ చీరలు’వచ్చాయని తెలిసిందే లేదో.. మహిళలు షాపులకు క్యూ కట్టారు. చీరల్ని కొనుగోలు చేసేందుకు తెగ ఎగబడ్డారు. రకరకాల రంగుల్లో డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీతో మోదీ ఫోటోలను ఈ చీరలపై ముద్రిస్తున్నారట వ్యాపారులు. శారీలకు మంచి గిరాకీ వచ్చిందని.. రాబోయే రోజుల్లో మోదీతో పాటూ ప్రముఖ రాజకీయ నేతల చిత్రాలను ముద్రించి చీరల్ని మార్కెట్‌లోకి తీసుకొస్తామంటున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25205
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author