ఫిబ్రవరిలోనే మెట్రో పరుగులు

ఫిబ్రవరిలోనే మెట్రో పరుగులు
February 14 11:44 2019

హైద‌రాబాదు మెట్రో రైల్ తొలుత స‌రైన స్పంద‌న లేక‌ నిరాశ ప‌రిచినా ఎల్బీన‌గ‌ర్ మార్గం ప్రారంభం అయ్యాక బాగార‌ద్దీ పెరిగింది. ముఖ్యంగా మియాపూర్‌-ఎల్బీన‌గ‌ర్ దూరాన్ని చేర‌డానికి గంట‌న్న‌ర స‌మ‌యాన్ని త‌గ్గించ‌డ‌మే కాకుండా కాలుష్య‌ర‌హిత ప్ర‌యాణానికి దోహ‌ద‌ప‌డింది. దీంతో దూర ప్ర‌యాణం చేసేవారు మెట్రోను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే, హైద‌రాబాదు మెట్రోలో హాట్ రూట్ అమీర్‌పేట్ – హైటెక్ సిటీ రోడ్డు. అది ఇంత‌వ‌ర‌కు ప్రారంభం కాలేదు. దాని కోసం ల‌క్ష‌ల మంది ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆ రోడ్లో మెట్రో ఓపెన్ అయితే మా ట్రాఫిక్ కష్టాలు తీర‌తాయ‌ని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. ఆ స‌మ‌యం వ‌చ్చింది. హైటెక్ సిటీ మెట్రో ముఖ్యధికారులు ఈరోజు ఈమార్గంలో సేఫ్టీ టెస్టులు నిర్వ‌హించారు. ఈ మార్గాన్ని కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్ర‌మాణాలు ప‌రిశీలించారు. ఉప్పల్ డిపోతో పాటు అమీర్‌పేట్ నుంచి హైటెక్ సిటీ మార్గాన్ని చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ రాజు తదితరులు పరిశీలించారు. రెండు మూడు మార్లు ఈ రూట్లో వారు ప్ర‌యాణించి ప‌రిశీలించారు. ఇది విజ‌య‌వంతంగా ముగిసింది అతి తొంద‌ర‌లో బ‌హుశా ఈ ఫిబ్ర‌వ‌రిలోనే ఇది ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. ఇక గంట‌లు గంట‌లు ట్రాఫిక్‌తో ఇబ్బంది ప‌డుతున్న ఐటీ ఉద్యోగుల‌కు ఇది భారీ ఊర‌ట క‌లిగించ‌నుంది

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25212
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author