చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ

చంద్రబాబుతో టీటీడీపీ నేతల భేటీ
October 08 17:21 2017
హైదరాబాద్ లోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో తెలంగాణ టీడీపీ నేతలు ఆదివారం నాడు భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రమణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్రెడ్డి,  సీనియర్ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.
తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడం, కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయమై ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడవద్దని పార్టీ నేతలు, నాయకులను హెచ్చరించినట్టు సమాచారం. పొత్తులపై ఇప్పుడే ప్రకటనలు అనవసరమని చంద్రబాబు వారిని వారించినట్లు తెలుస్తోంది. గ్రూపులు వద్దని, పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు టీటీడీపీ నేతలకు సూచించారు. తనపై ఆధారపడకుండా సొంతంగా తెలంగాణలో బలపడాలని, గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.  ఏ నేతలు వలస వెళ్లినా నష్టం ఉండబోదని, కార్యకర్తల బలం క్షేత్రస్థాయిలో పార్టీకి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 పార్టీ కోసం తాను త్వరలోనే తెలంగాణలో పర్యటిస్తానని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు చెప్పినట్టు తెలుస్తోందికాగా, తొలిసారిగా టీటీడీపీ సమావేశానికి మాజీ మంత్రి దేవేందర్ గౌడ్,ఎల్బీ నగర్ ఎమ్మెల్యే  ఆర్. కృష్ణయ్య హాజరయ్యారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2522
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225