వైరల్ గా మారిన ఆదిల్ చివరి వీడియో

వైరల్ గా మారిన ఆదిల్ చివరి వీడియో
February 15 15:59 2019

జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా అవంతిపొర పట్టణ సమీపంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఆత్మహుతి దాడి జరిగిన కొన్ని నిమిషాల్లోనే పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటనను విడుదల చేసింది. ఈ దాడి తమ పనేనని స్పష్టం చేసింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ అలియాస్ వకాస్‌ చివరి వీడియోను విడుదల చేసింది. వెనుక జైషే జెండాతో పాటు చేతిలో తుపాకీ, ఒంటి నిండా అత్యాధునిక ఆటోమేటిక్ రైఫిళ్లు, పేలుడు పదార్థాలను తగిలించుకుని ఆదిల్ ఆ వీడియోలో మాట్లాడుతున్నాడు.‘నా పేరు ఆదిల్. నేను ఏడాది క్రితం జైషే మొహమ్మద్‌లో చేరాను. ఏడాది పాటు ఎదురుచూసిన తరవాత జైషే కోసం పనిచేసే అవకాశం వచ్చింది. ఈ వీడియోను మీరు చూసేలోగా నేను స్వర్గంలో ఉంటాను. కశ్మీర్ ప్రజలకు నేను ఇచ్చే చివరి సందేశం ఇదే. దక్షిణ కశ్మీర్ చాలాకాలంగా భారత్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. ఉత్తర, మధ్య కశ్మీర్‌తో పాటు జమ్మూ ప్రజలు ఈ పోరాటంలో చేరాల్సిన సమయం ఆసన్నమైంది. మా కమాండర్లలో కొందరిని చంపేయడం ద్వారా మమ్మల్ని ఎన్నటికీ బహీనపరచ్చలేరు’ అని అదిల్ ఆ వీడియోలో చెప్పాడు. ఈ సందర్భంగా 2001లో పార్లమెంట్‌పై దాడి, ఐసీఏ18 హైజాక్, నగ్రోటా దాడి, ఉరి ఎటాక్, పఠాన్‌కోట్ ఐఏఎఫ్ బేస్ దాడులను ఆదిల్ ప్రస్తావించాడు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. ఆదిల్ అహ్మద్ దార్ తన ఇద్దరి స్నేహితులు తౌసీఫ్, వసీమ్‌లతో కలిసి పుల్వామాలోని గుందిబాగ్ నుంచి 2016 మార్చి 19న అదృశ్యమయ్యాడు. తౌసీఫ్ అన్నయ్య మంజూర్ అహ్మద్ దార్ కూడా ఉగ్రవాదే. ఇతన్ని 2016లో భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఆదిల్ పాఠశాల స్థాయిలోనే చదువు ఆపేశాడు. అనంతరం కొద్దికాలం తాపీమేస్త్రీగా పనిచేశాడు. మరికొంత కాలం స్థానిక మసీదులో పనిచేశాడు. ఇతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ఏడాది క్రితం జైషేలో చేరిన ఆదిల్.. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాలతో నింపిన కారుతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడిచేసి 40 మందికి పైగా జవాన్లను పొట్టనబెట్టుకున్నాడు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25254
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author