సామాజిక వైద్యశాలకు నిర్లక్ష్య రోగం

సామాజిక వైద్యశాలకు నిర్లక్ష్య రోగం
February 19 15:20 2019

మంథని నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక వైద్యశాలకు నిర్లక్ష్య రోగం పట్టుకుంది. పేరుకు మాత్రం 50 పడకల ఆసుపత్రియే కాని ఇక్కడి రోగులకు అందే వైద్యసేవలు అంతంతా మాత్రమేవైద్యుల సిబ్బంది కొరతకు తోడు ఇన్‌ఛార్జీ పాలన, వైద్యశాల ఆవరణలో లోపించిన పారిశుద్ధ్యం వంటి సమస్యలతో, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందకపోవడంతో రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందిసు ్తన్నామని గొప్పలు చెప్పుకునే ప్రజా ప్రతినిధులు, అధికారులు మంథని  ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి చూస్తే రోగులు పడే అవస్థలు తెలుస్తాయి.మంథని పట్టణంతో పాటు మంథని, ముత్తారం తదితర మండలాల నుంచి వందల సంఖ్యలో మంథని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. అయితే రోగుల సరిపడిన వైద్య సిబ్బంది లేకపోవడంతో కొంత మంది రోగులు నిరాశతో వెనుదిరగుతున్నారు. సీజనల్ వ్యాధుల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. సాధారణ సమయంలో 100 నుంచి 150 వరకు నిత్యం ఓపి ఉండగా, సీజనల్ సమయంలో నిత్యం 300ల మంది వరకు రోగులు ఓపి కోసం క్యూ కడుతుంటారు.మంథని ప్రభుత్వ వైద్యశాల పేరుకు 50 పడకల ఆసుపత్రి అని పేరు ఉన్నప్పటికీ రెండు జనరల్ వార్డులు, ఐసీయూలో కలిపి మొత్తం 30 పడకలు మాత్రమే ఉన్నాయి. విష జ్వరాల సీజనల్ సమయంలో బెడ్స్ సరిపోకపోవడంతో ఇతర ప్రాంతాలలోని ప్రభుత్వాసుపత్రులకు రోగులను బలవంతంగా తరలించడం ఇక్కడ పరిపాటిగా మారింది. మంథని సామాజిక వైద్యశాలలో వైద్య సిబ్బంది కొరత వేదిస్తున్నది. 13 మంది డాక్టర్లు ఉండాల్సిన స్థానంలో కేవలం ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉండడం గమనార్హం. ఉన్న ముగ్గురిలో ఒకరు రెగ్యూలర్ డాక్టర్ కాగా, మరొకరు కాంట్రాక్టు బేస్  డాక్టర్, మరొకరు డిప్యూటేషన్‌పై వచ్చిన డాక్టర్. వైద్యశాలలో ఒక జనరల్ సర్జన్, ఒక ఆర్థో, ఇద్దరు పిల్లల డాక్టర్లు, ఇద్దరు మత్తు డాక్టర్లు, ఒక కంటి డాక్టర్, ఇద్దరు గైనకాలజిస్టులు, ముగ్గురు డ్యూటీ డాక్టర్లు, ఒక డెంటల్ డాక్టర్ ఉండాల్సి ఉంటుంది.కాని ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. హెడ్ స్టాప్ నర్సు పోస్టు ఖాళీగా ఉండటంతో పాటు 12 మంది స్టాప్ నర్సులకు గానూ ఏడుగురు మాత్రమే ఉన్నారు. ఇద్దరు ఫార్మాసిస్టులకు గానూ ఉన్నది మాత్రం ఒకే ఒక్క ఫార్మాసిస్టు, వార్డు బాయ్స్ కూడా సరిపడ లేరు.మంథని ప్రభుత్వా ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఫలితంగా నిరుపేద రోగులకు వైద్యం అందడం లేదు. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి వైద్యం చేయించుకోలేక పోతున్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు చొరవ చూపి సరిపడిన వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి రోగులకు వైద్యం అందే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25284
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author