పది మంది కొత్త మంత్రులు

పది మంది కొత్త మంత్రులు
February 19 15:35 2019

తెలంగాణ కేబినెట్ విస్తరణ మంగళవారం  ఉదయం 11.30 గంటలకు జరిగింది.  మొత్తం 10 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించారు. ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కిన వాళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ తానే స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులుగా అల్లోల ఇంద్రకణ్ రెడ్డి (ఉమ్మడి అదిలాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), వేముల ప్రశాంత్ రెడ్డి (ఉమ్మడి నిజామాబాద్), కొప్పుల ఈశ్వర్ (ఉమ్మడి కరీంనగర్), ఈటల రాజేందర్ (కరీంనగర్), వి. శ్రీనివాస్ గౌడ్ (మహబూబ్ నగర్), సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( ఉమ్మడి మహబూబ్ నగర్), జగదీశ్ రెడ్డి (నల్గోండ), ఎర్రబెల్లి దయాకర్ రావు (వరంగల్), చేమకూర మల్లారెడ్డి (మేడ్చల్) లు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. 2014 లో కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణాలో 2018 లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2014 లో సమైక్య రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్, అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిత్వ నేతృత్వంలో జూన్ 2 ను తెలంగాణా అపాయింటెడ్ డే గా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కూడా విజయ దుందుభి మోగించి, రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ డిసెంబర్ 13, 2018 న తాను ముఖ్యమంత్రిగా, మహమూద్ అలీ హోంమంత్రిగా గవర్నర్ సమక్షంలో రాజ్ భవన్ లో  ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు  కొత్తమంత్రులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మంత్రులకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.అయితే, మంత్రివర్గ కూర్పుపై విపక్షాలు మండిపడుతున్నాయి. గత మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని, ఇప్పుడు కూడా మహిళకు స్థానం లేకుండా కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఇక, ఈ పది మంది చేరికతో క్యాబినెట్ సంఖ్య 12కు చేరనుండగా, తెలంగాణలోని ఎమ్మెల్యే సీట్ల లెక్క ప్రకారం మరో ఆరుగురికి మంత్రులయ్యే చాన్స్ ఉంటుంది. కొత్తగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల్లో ఐదుగురు రెడ్డి, ముగ్గురు బీసీ, ఒక వెలమ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. వీరిలో నలుగురు పాత కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రులుగా వున్నారు. తాజాగా ఆరుగురు కొత్త వాళ్లకు మంత్రి ఛాన్స్ వచ్చింది. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25287
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author