నేను తెరాస సైనికుడిని

నేను తెరాస సైనికుడిని
February 19 15:44 2019

నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం. కేసీఆర్ ఏ బాధ్యతలు అప్పగించినఆ ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తా. నాకు మంత్రిపదవి రాలేదు అని బాధ లేదని ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేసారు.  మంగళవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హజరైన హరీష్ రావు తరువాత మీడియాతో మాట్లాడారు.  కొత్తగా ఎన్నికైన మంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన హరీష్ తాను  టీఆర్ఎస్ పార్టీలో సైనికుడిని అన్నారు. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు పూర్తిస్థాయిలో మంచిగా పనిచేసి ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటున్నాని తెలిపారు. ఎన్నికల సమయంలో కూడా చెప్పాను, నేను టీఆర్ఎస్ పార్టీలో క్రమశిక్షణ గల సైనికుడిగా పనిచేస్తున్నాను. పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్గారు ఏది ఆదేశిస్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇప్పటికే పదుల సార్లులో చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగారు ఆయా ప్రాంతాలు, అన్ని వర్గాలు, సమీకరణలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. నాకు వారు ఏ భాధ్యత అప్పగించినా క్రమశిక్షణగల కార్యకర్తగా దానిని అమలు చేస్తాను. నాకు అసంతృప్తి ఉండటం కాని అటువంటిది ఏదీ కూడా ఉండదు. ఎవరైనా సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరుమీద ఎటువంటి గ్రూపులు, సేనలు లేవు. ఎవరైనా పెట్టుకుంటే దాన్ని సీరియస్గా తీసుకోవద్దని అయన అన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25290
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author