గరుడ బస్సుకు తప్పిన ప్రమాదం

గరుడ బస్సుకు తప్పిన ప్రమాదం
February 21 12:13 2019

తెలంగాణ ఆర్టీసీకి చెందిన వోల్వో బస్సుకు  గురువారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపివేసి ప్రయాణికులను కిందకు దించేశాడు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సంఘటన జరిగినప్పుడు బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. అనంతరం అధికారులు వారిని వేరే బస్సులో తరలించారు.  సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఎలక్ట్రికల్ వైరింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25339
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author