అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన “వినరా సోదరా వీరకుమారా” సాంగ్.

అనిల్ రావిపూడి లాంఛ్ చేసిన “వినరా సోదరా వీరకుమారా”  సాంగ్.
February 21 14:43 2019

లక్ష్మణ్ సినీ విజన్స్ పతాకం పై శ్రీనివాస సాయి ,ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల  దర్శకత్వంలో ,లక్ష్మణ్ క్యాదారి నిర్మించిన చిత్రం ‘ వినరా సోదర   వీరకుమారా’ .ఈ చిత్రం  ఫస్ట్ సాంగ్ ని  ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి  ఇటీవల హైదరాబాద్ లో  లాంచ్ చేసారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ నిర్మాత బెక్కం వేణు గోపాల్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ” వినరా సోదర వీరకుమారా   ట్రైలర్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్  గా ఉంది. సాంగ్స్ కూడా చాల బాగున్నాయి. ఈ సినిమా హిట్ అవుతుందని ఆశిస్తూ, టీమ్ మొత్తానికి నా విషెస్ తెలియజేస్తున్నాను.’ అన్నారు.ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ  ‘ఈ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ నేను కలసి మేం వయసు కి వచ్చాము మూవీ చేసాం. ఈ చిత్ర టీం కొత్త ప్రయత్నం చేశారు.మూవీ చాలా బాగుంది. దర్శకుడు అనిల్ తో సాంగ్ లాంచ్ చేయడం శుభ పరిణామం ‘ అని అన్నారు.చిత్ర నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ”  మా సినిమా మొదటి పాటను  అనిల్ రావిపూడి గారు రిలీజ్ చేయడం  సంతోషం గా ఉంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను ‘ అన్నారు.ఇంకా ఈ  కార్యక్రమంలో  హీరో శ్రీనివాస సాయి ,  చిత్ర దర్శకుడు  సతీష్ చంద్ర నాదెళ్ల ,  అనిల్ మైలాపురం , కిరణ్ .సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస సాయి , ప్రియంకజైన్, జాన్సీ, ఉత్తేజ్, జెమిని సురేష్  తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : రవి.వి  ,సంగీతం: శ్రవణ్ భరద్వాజ్ , మాటలు: లక్ష్మీ భూపాల , ఎడిటర్ :మార్తాండ్ .కె.. వెంకటేష్. నిర్మాత: లక్ష్మణ్ క్యాదారీ,  దర్శకత్వం: సతీష్ చంద్ర నాదెళ్ల.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25345
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author