అమరులారా ..మీ త్యాగం చిరస్మరణీయం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

అమరులారా ..మీ త్యాగం చిరస్మరణీయం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం
February 21 16:55 2019

భారతీయ శక్తిని దెబ్బ తీసేందుకు జరుగుతున్న దాడ్లుల్లో అమరులైన వీరుల త్యాగం వృధాపోదని ,అది చిరస్మరణీయమని భారత విద్యార్థి ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఎండి.సుజాయిత్ అలీ పేర్కొన్నారు. గురువారం  భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణం కొత్త బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.  సుజాయిత్ అలీ మాట్లాడుతూ గురువారం జమ్ము- కాశ్మీర్ లోని పుల్వామాలో సిఆర్పిఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడిని తీవ్రంగా ఖండిస్తూ దాడిచేసిన ముష్కరులను భారత సైన్యం విడిచి పెట్టదని తగిన గుణపాఠం చెప్తుందని అన్నారు. భారత జవాన్లు కుటుంబాలను ప్రాణాలను కుటుంబ మమకారాలను వదిలిపెట్టి   దేశ భద్రత ధ్యేయంగా విధులు నిర్వహిస్తుందన్నారు.  జమ్మూ కాశ్మీర్ బలగాలపై ఉగ్రవాదులు దాడి చేయడాని ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా శాఖ తీవ్రంగా ఖండిస్తూ సంతాపం వ్యక్తం చేశారు.  ఈ కార్యక్రమంలో అస్లాం, అక్రమ్, షాదబ్, జావిద్, ఫాహాద్, షోయబ్ ,కిరణ్, హర్షత్, రహిమాన్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25365
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author