స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌

స్టార్ డైర‌క్ట‌ర్ వినాయ‌క్ చేతుల మీదుగా `డిసెంబర్ 31` మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్‌
February 22 15:02 2019

 గౌతం క్రియేష‌న్స్ ప‌తాకంపై గ‌ణ‌గ‌ళ్ల మాన‌స స‌మర్ప‌ణ‌లో జి.ల‌క్ష్మ‌ణరావు నిర్మిస్తోన్న చిత్రం `డిసెంబ‌ర్  31` `వ‌ర్మ‌గారి బంగ్లా` ట్యాగ్ లైన్.  జి. కొండ‌ల‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నారు. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన మోష‌న్ పోస్ట‌ర్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ చేతుల మీదుగా హైదారాబాద్ లో  లాంచ్ చేశారు. ఈ సంద‌ర్భంగా వి.వి.వినాయ‌క్ మాట్లాడుతూ…“మోష‌న్ పోస్ట‌ర్  చాలా  క్రియేటివ్ గా ఉంది.  స్టోరి లైన్ విన్నాను. స‌స్పెన్స్ తో కూడిన కామెడీ థ్రిల్ల‌ర్ .  ముఖ్యంగా సినిమాకు  ఏసిపి ర‌వీంద్ర పాత్ర ప‌వ‌ర్ ఫుల్ గానే కాకుండా  సినిమాకే   హైలెట్ గా నిల‌వ‌నుంది . సినిమా స‌క్స్ స్ సాధించాల‌ని కోరుకుంటూ యూనిట్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు. ద‌ర్శ‌కుడు జి.కొండ‌ల‌రావు మాట్లాడుతూ…“ఈ సినిమా అర‌కు, వైజాగ్, హైద‌రాబాద్ ప‌రిస‌ర  ప్రాంతాల్లో షూటింగ్ చేశాము. క‌థ విష‌యానికొస్తే…ప్ర‌తి డిసెంబ‌ర్ 31 కు ఎంతో మంది అమ్మాయిలు పార్టీ పేరుతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. హ‌త్య‌లు చేయ‌బ‌డుతున్నారు. అస‌లు ఇది ఎలా జ‌రుగుతుంది?  దీన్ని ఏ విధంగా ఆవ‌ప‌వ‌చ్చు. అస‌లు చేస్తుంది ఎవ‌రు?  దానిని గుర్తించ‌డం కోసం స్పెష‌ల్ ఆఫీస‌ర్ , ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిష్ట్ ఏసిపి ర‌వీంద్ర రంగంలోకి దిగి అస‌లు హంత‌కుల‌ను ఎలా ప‌ట్టుకున్నారు అన్న‌ది చిత్ర క‌థాంశం. మా సినిమా మోష‌న్ పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన వినాయక్ గారికి నా ధ‌న్య‌వాదాలు“ అన్నారు. ఈ చిత్రంలో జి.కొండ‌ల‌రావు, న‌వ‌కాంత్, ష‌క‌ల‌క శంక‌ర్‌, పోసాని, గౌతం రాజ్‌, న‌రేష్ , గిరీష్‌, హ‌ర్ష‌, శ్రావణి, మ‌ధురెడ్డి, అమీషా త‌దిత‌రులు న‌టించారు.స‌హ‌నిర్మాతః అంబ‌టి రాఘ‌వేంద్ర‌రెడ్డి;  రాయితి రమ‌ణ‌మూర్తి;  జి.అప్పారావు; స‌ంగీతంః బోలె;  పాట‌లుః కందికొండ‌;  కెమెరాః వెంక‌ట్;  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ః పాట శ్రీను;  పీఆర్వోః వంగాల కుమార‌స్వామి; క‌థ‌-స్క్రీన్ ప్లే -ద‌ర్శ‌క‌త్వంః జి.కొండ‌ల‌రావు; నిర్మాతః జి.ల‌క్ష్మ‌ణ‌రావు, 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25397
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author