దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
February 22 16:36 2019

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు.  గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ తొని చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలను తెరకెక్కించారు. మంగమ్మ గారి మనవడు, గూఢచారి నం.1, ఆహుతి, శత్రువు, తలంబ్రాలు, భారతంలో బాల చంద్రుడు, స్టేషన్ మాస్టర్, అమ్మోరు, దేవి, దేవుళ్లు, అంజి, దేవీపుత్రుడు, అరుంధతి తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులందరితోనూ ఆయన సినిమాలు రూపొందించారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వం వహించలేదు. కోడి రామకృష్ణ మృతిపై తెలుగు నిర్మాతల మండలి సంతాపం వ్యక్తం చేసింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25403
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author