జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ అరెస్ట్

జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ అరెస్ట్
February 23 14:21 2019

పుల్వామా దాడి తర్వాత కశ్మీర్‌లో వేర్పాటువాద నేతలకు భద్రతతో సహ ఇతర సదుపాయాలను ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. తాజాగా కశ్మీర్ వేర్పాటువాద నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చీఫ్ యాసిన్ మాలిక్‌ను శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన వారం రోజుల అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. మైసుమా పట్టణంలోని ఆయన స్వగ్రహం నుంచి మాలిక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం కోఠిబాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికేతరులు జమ్మూ కశ్మీర్‌లో స్థిరాస్తిని కలిగివుండడాన్ని నిషేధించే ఆర్టికల్ 35-ఎపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా మాలిక్‌ను అరెస్ట్ చేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా భద్రతా బలగాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. భారీగా పారా మిలటరీ దళాలు, పోలీసులను మోహరించారు. కానీ, యాసిన్ మాలిక్‌ను అదుపులోకి తీసుకున్న విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించిన అధికారులు, వివరాలను కూడా వెల్లడించలేదు. నాలుగు రోజుల కిందట కశ్మీర్‌లో యాసిన్ మాలిక్‌తో సహా 18 మంది వేర్పాటువాద నాయకులు, 155 మంది రాజకీయ నాయకులకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించింది. దీనిపై హోంశాఖ అధికార ప్రతినిధి మాట్లాడుతూ… వేర్పాటువాద నేతలకు భద్రతను కల్పించడమంటే రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉన్న వనరులను వృథాచేయడమేని అన్నారు. వీరికి భద్రత కల్పించిన సిబ్బందిని మంచి పనులకు వినియోగిస్తామని స్పష్టం చేశారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25441
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author