అప్పు చేయడం తప్పు కాదు

అప్పు చేయడం తప్పు కాదు
February 23 17:32 2019

పదేళ్లలో రూ. 30 లక్షల కోట్లను ఖర్చు చేయబోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అప్పులు తెచ్చి కాళేశ్వరంలాంటి భారీ ప్రాజెక్టులను కడుతున్నామని చెప్పారు. అప్పు చేసినా తీర్చే స్తొమత రాష్ట్రానికి ఉందని తెలిపారు. సెక్షన్-3 కింద కేటాయింపులు జరపాలని ప్రధాని మోదీకి ఇప్పటి వరకు 100 లేఖలు రాసినా స్పందన లేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తక్కువ ప్రొటోకాల్ ఉన్న మంత్రులను కూడా కలిశానని చెప్పారు. రూ. 50 వేల కోట్లతో గ్రామాలను బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ఆరు నెలల్లోగా భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేస్తామని తెలిపారు.అమెరికా అత్యంత ధనిక దేశమే కాదు. అత్యంత అప్పులున్న దేశం కూడా అని సీఎం కేసీఆర్ అన్నారు. అటువంటి అమెరికా తెలివి లేక అప్పులు చేసిందా? అని సీఎం ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రాష్ట్రం అప్పుల దిశగా పయనిస్తుందన్న సభ్యుల ప్రశ్నలకు సీఎం కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని దాటలేదన్నారు. చైనా జీఎస్‌డీపీ మన కంటే తక్కువ. చైనా మన కంటే పెద్ద దేశం అయినా.. ప్రతికూలతలు చాలా ఉన్నయి. 1980 వరకు చైనా మనకంటే పేదరికంలో ఉంది. చైనాలో కరువు వస్తే ఒకేసారి 7 లక్షల మంది చనిపోయారు. కాగా పాలకుల విధానాల వల్ల రెండు మూడు దశాబ్దాల కాలంలోనే చైనా మన కంటే వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. లంగాణ నుంచి కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా నిధులు పోతున్నాయని.. రాష్ర్టానికి రూ.24వేల కోట్ల దాకా తిరిగి వస్తున్నాయని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివరించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. ప్రతీనెలా పంచాయతీలకు సకాలంలో నిధులు విడుదల చేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే నగదుతో సంబంధం లేకుండానే రైతుబందు కింద రూ.10వేలు ఇస్తామని పేర్కొన్నారు. రైతులకు నేరుగా రుణమాఫీ చెక్కులు అందజేసే ఆలోచన చేస్తున్నట్లు సీఎం వివరించారు. రైతులపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని.. వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు చెల్లిస్తామని స్పష్టం చేశారు. రైతులకు నాలుగు దఫాలుగా రుణమాఫీ చేస్తామని రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేయగా బ్యాంకర్లు రైతులను ఇబ్బందిపెట్టారు. రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ నగదును జమ చేయగానే లబ్ధిదారుల నుంచి బ్యాంకర్లు వడ్డీ కట్‌ చేసుకున్న సంఘటనలు కొన్నిచోట్ల జరిగాయి. మరోసారి రైతులకు అలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులు అందజేయడానికి సీఎం కేసీఆర్‌ సన్నాహాలు చేస్తున్నారుమనకంటే చిన్న దేశం ఇండోనేషియాలో రూ. 24 లక్షల కోట్లు మార్కెట్‌లోకి వచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా జపాన్ జీఎస్‌డీపీ కంటే 300 శాతం అధికంగా అప్పులు తీసుకుంటుందని తెలిపారు. అప్పులు తెచ్చేది తినడానికి కాదు.. అభివృద్ధి కోసం, ప్రాజెక్టులు కట్టడం కోసమని సీఎం పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన 25 సంవత్సరాల బాండ్స్ కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. తెలంగాణ బాండ్లను బ్యాంకులు పోటీ పడి కొన్నవి. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్నాకే అప్పు ఇస్తారు. రాష్ర్టాల హక్కులను కేంద్రం కాలరాస్తోంది. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు అవసరం. మార్పుకు అనుగుణంగా పరిపాలకులు మారాలన్నారు. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది. వచ్చే పదేళ్లలో తెలంగాణ ఖర్చు పెట్టబోయే బడ్జెట్ రూ. 30 లక్షల కోట్లు. నదీ జలాల వాటాపై తేల్చాలని ప్రధాని మోదీకి తానే స్వయంగా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. పొరుగు రాష్ర్టాలతో ఒప్పందాలతో నీటి సమస్యలను పరిష్కరించినం. ఎన్ని సూచనలు చేసినా కేంద్రం పట్టించుకోదు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రాజెక్టులు కడుతున్నాం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వచ్చాయి. రాష్ట్రం కోసం ప్రొటోకాల్ తక్కువ ఉన్న మంత్రులను కూడా స్వయంగా కలిశా. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి రంగారెడ్డి జిల్లాకు నీరందిస్తం. ఈ ప్రాజెక్టు కింద 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతది. పార్లమెంట్ ఎన్నికల తర్వాతైనా కేంద్రంలో గుణాత్మక ప్రభుత్వం ఏర్పడాలన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25456
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author