మరో వివాదంలో రాహుల్ గాంధీ

మరో వివాదంలో రాహుల్ గాంధీ
February 23 17:42 2019

జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జైషే మహ్మద్ ఉగ్రవాది ఫిబ్రవరి 14న ఆత్మాహుతి దాడికి పాల్పడి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నాడు. అయితే ఆరోజు సాయంత్రం 6:30 గంటల వరకు ప్రధాని నరేంద్ర మోదీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కార్బెట్ నేషనల్ పార్క్‌లో బోటు షికారులో మొసళ్లను చూస్తూ ఫొటో, వీడియో షూట్‌లతో మోదీ బిజీబిజీగా గడిపారని కాంగ్రెస్ విమర్శించింది. సాయంత్రం ఆరున్నర గంటలవరకు షూటింగ్‌లో పాల్గొన్న మోడీ, 6:45 గంటలకు టీ, స్నాక్స్ తీసుకున్నారని.. ఉగ్రదాడి తర్వాత ఇలా ఏలా ఉండగలిగారని ప్రశ్నించారు. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం 3:10 గంటలకు సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి జరిగితే కొన్ని గంటలకే ప్రధాని మోదీ రాంపూర్ గెస్ట్ హౌస్‌లో ఎంజాయ్ చేశారని విమర్శించారు. సైనికులు అమరులైతే మరోవైపు మోదీ బోటింగ్‌కు వెళ్లి షూటింగ్‌లతో బిజీగా ఉండటం పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం మోదీ తీరును తప్పుపట్టారు. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ప్రధాని మోదీ ఇలా వ్యవహరించారని కొన్ని ఫొటోలతో ట్వీట్ చేశారు. వాతావరణం సరిగా లేని కారణంగా ప్రధాని మోదీకి విషయం త్వరగా తెలియజేయలేకపోయారట. నెహ్రూ సెల్ టవర్ సిగ్నల్స్‌కు అంతరాయం కలిగించారంటూ నెటిజన్లు జోకులు పేల్చారు. దేశానికి ప్రధాని నుంచి ఏం ఆశిస్తాం. దాడి జరిగిన వెంటనే కేబినెట్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి ఏం చర్యలు తీసుకోవాలో నిర్ణయించడానికి బదులుగా షూటింగ్‌తో బిజీగా ఉన్నారని సుర్జేవాలా వ్యాఖ్యలను కథనాలుగా ప్రచురించారు. కాంగ్రెస్ పార్టీ, అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు అసత్యాలు. రెండు కారణాలున్నాయి. కార్బెట్ పార్క్‌లో ఆరున్నర గంటల సమయంలో, ఉగ్రదాడి జరిగిన కొన్ని గంటలకు ప్రధాని షూటింగ్‌లో పాల్గొనడం అనేది నిజం కాదు. ఆరోజు మోదీ టూరిజం శాఖ కొరకు కార్బెట్ పార్క్‌లో పని పూర్తిచేసుకుని రుద్రాపూర్‌లోన బహిరంగ సభకు బయలుదేరారు. అదే సమయంలో దాదాపు 4 గంటలకు దాడి విషయం మోదీకి తెలిసిందని టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ట్ టీమ్ గుర్తించింది. దాడి జరిగింది 3:10 గంటలకు కాదని, మూడున్నర గంటలకు జరిగిందని ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ టైమ్ షెడ్యూల్‌ను తప్పుగా అర్థం చేసుకుని దుష్ప్రచారం చేసింది. అదేరోజు మధ్యాహ్నం 1:52 గంటలకు బీజేపీ నేషనల్ కో ఆర్డినేటర్ విశ్వకేతు వైద్య మోదీ ఫొటోను పోస్ట్ చేశారు. సాయంత్రం 6:45 గంటలకు మోదీ చాయ్, సమోసాలు తినలేదని గ్రహించాలి. దాడి జరిగిన తర్వాత ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకాశ్మీర్ గవర్నర్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలతో బిజీగా ఉన్నారని ఇండియా టుడే రిపోర్ట్ చేసింది. ఢిల్లీలో లేని కారణంగా దాడి జరిగిన తర్వాత మోదీ కేబినెట్ భేటీ ఏర్పాటు చేయలేకపోయారు. ఉత్తరాఖండ్‌లోని రాంపూర్‌లో ఉన్నప్పటికీ మోదీ పలు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించారు. బరేలీ ఎయిర్‌పోర్ట్ నుంచి మోదీ ఢిల్లీకి వెళ్లిపోయారు. సాయంత్రం 4 నుంచి 4:45 నిమిషాల సమయంలో సమీక్ష కార్యక్రమాలలో పాల్గొన్నారు. అంతకుముందు రాంపూర్‌లోని గెస్ట్ హౌస్‌లో విశ్రాంతి తీసుకున్న సమయంలోనూ పరిస్థితిని తెలుసుకుంటూ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెండో రివ్యూ మీటింగ్ తర్వాత రోడ్డు మార్గంలో బరేలీకి చేరుకుని అక్కడినుంచి విమానంలో ఢిల్లీకి చేకున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25459
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author