గోవాకు స్పెషల్ స్టాటస్

గోవాకు స్పెషల్ స్టాటస్
February 25 11:05 2019

ఏపీకి ప్ర‌త్యేక హోదా హామీ నెర‌వేర‌లేదు. దీనికి బీజేపీయే కార‌ణ‌మ‌ని టీడీపీ …..కాదు కాదు టీడీపీదే త‌ప్పిదం అని బీజేపీ వాధిస్తున్నాయి. దీంతో ఏపీ ప్ర‌జ‌ల్లో కూడా గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌త్యేక హోదా విష‌యంలో టీడీపీ , బీజేపీ మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గు మ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అయితే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ తన స్వహస్తాలతో టీడీపీకి ఆయుధాన్ని ఇచ్చి మరీ ఇరుకున పడింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తిరుపతి వెంకన్న సాక్షిగా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని మోదీ మాట ఇవ్వడమూ నిజం. ప్రధాని అయ్యాక ఏవేవో కారణాలు చెప్పి మాట తప్పడమూ నిజం. ఏపీ విషయంలో మాట తప్పిన బీజేపీ.. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో గోవాకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చింది. తాజాగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు వినయ్ సహస్రబుద్ధే.. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో గోవాకి ప్రత్యేకహోదా ఉంటుందని ప్రకటించారు. ఇదే ఇప్పుడు టీడీపీకి ఆయుధంగా మారింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారట. ఏపీకి హోదా ఇస్తానని మాట తప్పిన బీజేపీ.. ఇప్పుడు గోవాలోనూ అదే హామీనిచ్చి ప్రజలను మోసం చేస్తోందని బీజేపీని ఎండగట్టాలని బాబు కోరారట. ఎన్నికలు వస్తున్నాయని ఓట్ల కోసం బీజేపీ గోవాలో హోదా రాజకీయం మొదలుపెట్టింది. అందుకే మేనిఫెస్టోలో గోవాకి హోదా అంటుంది. మరి ఏపీకి ఎందుకు ఇవ్వదు? అని దేశవ్యాప్తంగా తెలిసేలా నిలదీయడానికి చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారట. మరి ఏపీకి హోదా విషయంలో వెనకడుగు వేసిన బీజేపీ గోవా అంశాన్ని ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి. మొత్తానికి టీడీపీ భ‌లే ఆయుధ దొరికింది అంటూ తెలుగు త‌మ్ముళ్లు తెగ సంతోష ప‌డిపోతున్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25479
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author