యువత మార్పు రావాలంటోంది

యువత మార్పు రావాలంటోంది
February 25 14:40 2019

దేశం మీద ప్రేమతో రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం ఉదయం స్థానిక యూబీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పవన్ మాట్లాడారు. తాను ఎవరినీ నమ్మించడానికి ప్రయత్నం చేయనన్నారు. తనకు ఇతరులకు సహాయం చేయడమే తెలుసన్నారు.  పవన్ పర్యటన సందర్బంగా వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను విద్యార్థులు పవన్ దృష్టికి తెచ్చారు. ప్రాథమిక వైద్య కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడిందని విద్యార్థులు పేర్కొన్నారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను జనసేన మాత్రమే పరిష్కరించగలదన్నారు. రాజకీయాలకు యూనివర్సిటీ క్యాంపస్లు కేంద్రమయ్యాయన్నారు. యువత మార్పు కోరుకుంటోంది.  రౌడీయిజం, అవినీతి నశించాలి.  కొండారెడ్డి బురుజు చూస్తే ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి గుర్తుకు వస్తారు.  రెడ్డి అంటే ప్రజల రక్షకుడు, భక్షకుడు కాదని అయన అన్నారు.  కుల రాజకీయాలు నశించాలి.  కులాల ఐక్యతతో జనసేన రాజకీయాలు చేస్తుంది.  కులాలను విడదీసి రాజకీయ యాలు చేయడం మంచిది కాదని అన్నారు. కాటమరాయుడు ఓ గొర్రెల కాపరి, ఆయన పుట్టింది కర్నూలు జిల్లాలోనే.  కాటమరాయుడు నెల్లూరు రాజుల అహంకారంపై పోరాడారు.  రైతులు, డ్వాక్రా మహిళలకు చంద్రబాబు ప్రభుత్వ డబ్బులు ఇచ్చి ఓట్లు కొంటున్నారు.  ముస్లింలు దేశంలో అంతర్భాగం.  పాకిస్తాన్ లో యుద్దం జరిగితే ఇక్కడ దేశభక్తి చాటు కోవాలా అని ప్రశ్నించారు.  కొత్త వ్యక్తులను ఎన్నికల్లో నిలబెడతా.  నా దగ్గర వేలకోట్లు, ఛానల్స్, న్యూస్ పేపర్లు లేవు.  జనసేన సైనికులే నా ఛానల్స్, పేపర్లని అన్నారు. బీఎస్పీ స్థాపకుడు కాన్సిరామ్ నాకు ఆదర్శం.  సినిమాల్లో నేను సూపర్ స్టార్ ను, కానీ రాజకీయాల్లో అట్టడుగు నుంచి పై స్థాయికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు.  జగన్, చంద్రబాబు మాదిరిగా అబద్ధాల మేనిఫెస్టోను చెప్పను. వారికంటే మెరుగైన పాలన చేస్తానని అన్నారు.  అడ్డగోలుగా రాజ్యాధికారం చేయడం కుదరదు.  సిపిఎస్ రద్దు చేయాలని జగన్, చంద్రబాబును అడగండి.  రాయలసీమ నుంచి చాలా మంది ముఖ్యమంత్రులు అయినా సీమ వెనుకబడింది.  ఓర్వకల్లు ఏయిర్ పోర్టు వల్ల ఏమి ప్రయోజనం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.  నేను రాయలసీమలో నేను పుట్టలేదు కానీ సీమ కోసం నా ప్రాణాలు అర్పిస్తాను.    జనసేన సైనికులపై దాడులు కేసులు పెడితే చేస్తే సహించేది లేదు. రాయలసీమ రాగి సంకటి తిన్నవాన్ని.. జాగ్రత్త అని హెచ్చరించారు.  మీ ఇంట్లో ఒకడినౌతా… మీ కోసం ప్రానాలు అర్పిస్తానని అన్నారు.  కర్నూలు జిల్లాలో నిలబడే అభ్యర్థులను గెలిపిచండి.  2019 ఎన్నికలు చాలా కీలకమైనవి.  నన్ను ఓ రోజు టిడిపి, మరో రోజు వైసీపీ, టిఆర్ఎస్, బీజేపీ నాయకుడు అంటారు. నేను ప్రజల మనిషిని.  ప్రతి గ్రామంలో జనసేన పార్టీ జెండా పట్టుకొనే యువతరం ఉంది. కానీ వారికి అండగా నిలబడే నాయకుడు జనసేనలో లేరని అన్నారు.  ఎంపీ  టీజీ వెంకటేష్ ఎన్ని సార్లు తిట్టినా నిగ్రహంగా ఉన్నానంటే నేను సుస్వాగతం సినిమా షూటింగ్ కు వచ్చినప్పుడు సపోర్టు చేశాడని అయన అన్నారు.  టీజీ వెంకటేష్ కు రాజ్యసభ సీటు విషయంలో నేను అడ్డు పడలేదని అయన అన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25500
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author