వైభవంగా పెద్ద గట్టు జాతర

వైభవంగా పెద్ద గట్టు జాతర
February 25 15:31 2019

లింగో. ఓ లింగో అంటూ మిన్నంటే నినాదాలతో పెద్దగట్టు క్షేత్రం మారుమ్రోగుతున్నది.  తెలంగాణా నలు మూలాల నుంచే కాకుండా  జార్ఖండ్, చత్తిస్ ఘడ్, ఓడిశా, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రం ల నుంచి భక్తులు తరలి వచ్చి లింగమంతుల స్సామి కి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ,  మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం ఉదయాన్నే స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణా సంప్రదాయం లు, ఆచార వ్యవహారాలకు అద్దం పట్టే ఈ జాతర తో సూర్యాపేట పట్టణం ఉత్సవ శోభను సంతరించుకుంది.. ఫిబ్రవరి 24 న మకర తోరణం ఏర్పాటు తో ప్రారంభం అయిన ఈ జాతరలో రెండవ రోజైన ఈ రోజూ సోమవారం అత్యంత ముఖ్యమైన రోజు.  దాంతో  వేకువజామున నుంచే లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చి  స్వామి వారికి మొక్కులు చెల్లించున్నారు. గంపలతో గుట్టపైకి చేరుకొని  బోనాలు సమర్పించారు.  ఇక శివుడి సోదరి  సౌడమ్మ కు గొర్రెపిల్లను బలిలిచ్చారు. కనుచూపు మేరలో పెద్దగట్టు కు  10 కిలోమీటర్ల మేర భక్తులు డేరాలు వేసుకొని  వంటలు చేసుకొని సంబరాలు చేసుకున్నారు.  కుటుంబసమేతంగా పిల్ల పాపాలతో  యాదవ కులస్తులు ఇక్కడికి తరలి వచ్చారు. పెద్దగట్టు జనసంద్రంగా మారింది. నిన్నటిదాకా అరణ్యంగా ఉన్న పెద్దగట్టు  జనారణ్యంలా మారిపోయింది. భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ ప్రతి  ఐదు నిమిషాలు లకు ఒక బస్సు ను సూర్యాపేట బస్ డిపో నుంచి నడుపుతోంది.  జాతర దృష్టి లోబపెట్టుకొని  పోలీసులు హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25503
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author