రేషన్ డీలర్లు అంకితభావంతో పనిచేయాలి

రేషన్ డీలర్లు అంకితభావంతో పనిచేయాలి
February 25 17:17 2019

నీతి నిజాయితీగా అంకిభావంతో పనిచేసి, పేద ప్రజలకు సేవలందించి ప్రభుత్వానికి పూర్తిస్ధాయిలో సహకరిస్తామని రేషన్ డీలర్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్  అకున్  సబర్వాల్ సమక్షంలో ప్రమాణం  చేశారు. మార్చి 1వ  తేదీ నుంచి  జాతీయ రేషన్ డీలర్ల సంఘం  ఇచ్చిన రేషన్ బందులో తాము పాల్గొనబోవడం లేదని స్పష్టమైన హామి ఇచ్చారు. సోమవారం నాడు పౌరసరఫరాల భవన్ లో కమిషనర్ రేషన్ డీలర్లతో  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని జిల్లా రేషన్ డీలర్ల సంఘం  అధ్యక్షులు, కార్యదర్శులు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్  మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయల  సబ్సిడీలు భరించి రూపాయికే  కిలో బియ్యం   పేద ప్రజలకు అందిస్తోంది. ఈ  బియ్యాన్ని పేదలకు అందించడంలో రేషన్ డీలర్ల పాత్ర చాలా ముఖ్యమైనది. నిజాయితీ, అంకితభావంతో పనిచేసి మీ పాత్రకు న్యాయం చేయాలని రేషన్ డీలర్లకు విజ్ఞప్తి చేశారు. రేషన్  బియ్యం రీసైక్లింగ్ కు పాల్పడవద్దని, వాటిని ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేశారు.   రేషన్  ఫిర్యాదులకు  సంబంధించి ప్రతి రేషన్  షాపులో పౌరసరఫరాల శాఖ  టోల్ ఫ్రీ నంబర్  1967,1800  42500 3333,  వాట్సప్  నెంబర్ 7330774444 లను ఖచ్చితంగా డిస్ ప్లే  బోర్డుతో ఏర్పాటు  చేసుకోవాలని ఆదేశించారు.  జాతీయ రేషన్ డీలర్ల సంఘం పిలుపు ఇచ్చిన సమ్మెలో తెలంగాణ రాష్ట్రంలో డీలర్లు పాల్గొనకూడదని కమిషనర్ చేసిన విజ్ఞప్తి రేషన్ డీలర్లు తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని కోరారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25524
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author