ఉమ్మడి సొమ్ము’ క్రమంగా మాయమవుతుంది. వరంగల్ జిల్లాలో పలు చోట్ల క్రషర్లు, డాంబర్ ప్లాంట్ల నిర్వహణ యధేచ్ఛగా నిర్వహించబడుతున్నాయి. కళ్ల ముందే గుట్టలు కరిపోతున్న ఏమీ చేయలేని నిస్సాహాయ స్థితిలో పలు గ్రామాల ప్రజలు ఉన్నారు. క్రషర్ల నిర్వహణలో భాగంగా బోర్ బ్లాస్టింగ్ల శబ్దాలు జనానికి అలవాటుగా మారాయి. ఊరుమ్మడి సొమ్ముగా భావించే గుట్టలు కళ్లముందే క్రషర్ నిర్వహణతో కరిగిపోయిందని, ప్రస్తుతం ఇదే స్థానంలో డాంబర్ ప్లాంట్‌ను నిర్వహిస్తూ తమ ఆరోగ్యాలకు ముప్పు తేచ్చె చర్యలకు పూనుకున్నారని స్థానిక ప్రజలు అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. పలు మార్లు మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్ వరకు వినతులు ఇచ్చినప్పటికీ అధికారుల కదలటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.జిల్లాలో క్రషర్లు, డాంబర్‌ప్లాంట్ల నిర్వహణకు రాజకీయ అండదండలున్నాయని, దీంతో అధికారులు సైతం నిర్వహకుల కొమ్ముకాస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.“స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం వెనుక అంతర్యామేమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక గ్రామాల ప్రజల ఆమోదం లేకుండా నిర్వహించబడుతున్న జిల్లాలోని క్రషర్లు, క్వారీలు, డాంబర్ప్లాంట్లపై తగు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.క్రషర్లు వెదజల్లే దుమ్మూ,ధూళీతో మనుషులతో పాటు, పంట పొలాలు సైతం సతమతమవుతున్నా…పట్టించుకునే నాడుదే కరువయ్యాడు. డాంబర్ ప్లాంట్ల నిర్వహణతో వెలువడే పొగతో కాలుష్యం కొరలు చాస్తున్నా ఆపగలిగే స్థితిలో ప్రజలు లేరని స్థితి వరంగల్ రూరల్ జిల్లా పరిధిలో పలు గ్రామాలలో మారిందనేది గమనార్హం.వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని శాయంపేట, ఆత్మకూర్, పరకాల, నెక్కొండ, పర్వతగిరి, తదితర మండలాల్లో క్వారీలు, క్రషర్లు, డాంబర్‌ప్లాంట్లు యధేచ్చగా నిర్వహించబడుతున్నాయి. శాయంపేట మండలంలోని మాందారిపేట, పత్తిపాక గ్రామాలలో క్రషర్లతో పాటు డాంబర్‌ప్లాంట్లు నిర్వహించబడటాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నప్పటికీ అధికారులు మాత్రం ఏలాంటి చర్యలు చేపట్టకపోవటం చర్చానీయాంశంగా మారుతుంది. ప్రగతి సింగారం లాంటి చోట కూడా క్రషర్లు యదేచ్చగా నిర్వహించబడుతూ కళ్లముందే గుట్టలు కరిగిపోతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూర్ మండల పరిధిలోనూ కొత్తగట్టు, పెద్దాపూర్, కొత్తగట్టు సింగారం లాంటి చోట చూస్తుండగానే గుట్టలు కరిగిపోవటం గమనార్హం. పరకాల కామరెడ్డిపల్లి, నెకొండ మండలంలో రెడ్లవాడ, సాయిరెడ్డిపల్లిలో క్వారీలు, నెక్కొండ లో క్రషర్, పర్వతగిరి మండలంలోని చింత నెక్కొండ, కల్లెడలో క్రషర్లు, క్వారీల పేరుతో మైనింగ్‌ను తలపించే పరిస్థితులుండటం గమనార్హం.క్రషర్ల నిర్వహణతో వెదజల్లే దుమ్మూ, ధూళీతో పాటు అదనంగా డాంబర్‌ప్లాంట్లు నిర్వహించటంతో పొగ వ్యాప్తి చెందటం స్థానికుల్లో భయాందోళనను కలిగిస్తోంది. బోర్లు బ్లాస్టింగ్లతో ఇండ్లు కంభించిపోతున్నాయని, పొగతో కాలుష్యం చిదిమేసే పరిస్థితులున్నాయని, ఇప్పటికే క్రషర్లతో దుమ్మూ, ధూళీ పంట ఎదుగుదలకు ఆటంకంగా మారుతుందని ఆయా గ్రామాల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.