నటనలో మోదీ ఫస్టు

నటనలో మోదీ ఫస్టు
February 26 15:27 2019

ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విఫలమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. మంగళవారం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీకి టీఆర్ఎస్ వకాల్తా తీసుకుంటోందన్నారు. వైసీపీ ఫ్యాన్ ఏపీలో ఉంటే స్విచ్ మాత్రం హైదరాబాద్లో, ఫ్యూజ్ ఢిల్లీలో  ఉందని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు పరిశీలించాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వైసీపీ కావాలనే గగ్గోలు పెడుతోందన్నారు. మన పనితీరుకు, సాధించిన ప్రగతికి అవార్డులే గీటురాళ్లు. ఇక్కడ బిజెపి నేతలు విమర్శలు,ఢిల్లీ బిజెపి మంత్రులు అవార్డులు ఇస్తున్నారు. నిన్న  ఏడుఅవార్డులు మన జలవనరులకు, ఏడు అవార్డులు వైద్యశాఖకు వచ్చాయి. మోదిని మించిన నటుడు లేడు. పేదల సేవలో లీస్ట్ , కానీ నటనలో మోది ఫస్ట్ అని విమర్శించారు. మోది వస్తే దేశం మళ్లీ మరో 50 ఏళ్లు వెనక్కి పోతుంది. ఈ ఐదు ఏళ్ల మోది పాలనలోనే 50 ఏళ్లు వెనక్కిపోయాం. మోది రాకూడదని దేశం మొత్తం ఘోషిస్తోంది. ఏపిలో వైసిపి తరఫున టిఆర్ ఎస్ వకాల్తా తీసుకుంది. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి విఫలం అయ్యారు. ఆ బాధ్యతను టిఆర్ ఎస్ తీసుకుంది. ఫ్రస్టేషన్ తోనే వైసిపి అరాచకాలు సృష్టిస్తోంది. ఎర్రచందనం ఆదాయం పోయేసరికి వైసిపిలో ఫ్రస్టేషన్. వైసిపి నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. ఊరికొక రౌడీని వదులుతున్నారు. వైసిపి రౌడీయిజానికి ప్రజలు భయపడరని అయన అన్నారు. ఓట్లతోనే వైసిపి రౌడీలకు తగిన గుణపాఠం చెబుతారు. చంద్రగిరిలో రౌడీయిజంపై ప్రజలే తిరగబడ్డారు. నేరాలతో సంపాదించిన డబ్బుతో వైసిపి రౌడీయిజం చేస్తోంది. ప్రజల్లో చైతన్యం రావాలి. వైసిపి రౌడీయిజాన్ని తిప్పికొట్టాలి. ఏపిని మరో బీహార్ గా చేయాలని జగన్ కుట్రలు పన్నుతున్నారు. రౌడీల రాజ్యం చేయాలని కుతంత్రాలు చేస్తున్నారు. టిడిపి అధికారంలో ఉంటేనే రౌడియిజంపై ఉక్కుపాదం వుంటుంది. వైసిపి వస్తే గల్లీగల్లీకి రౌడీలు తయారవుతారు. మహిళలకు, చిన్నారులకు భద్రత ఉండదు. వ్యాపారులను వ్యాపారం చేసుకోనివ్వరు. చిత్తూరు, ఒంగోలు, దెందులూరు,కొండవీడు సంఘటనలే రుజువని అన్నారు. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెంచేందుకు వైసిపి కుట్రలు పన్నుతోంది. గతంలో హైదరాబాద్ లో మతకలహాలు సృష్టించింది వీళ్లే. ఇప్పుడు 13జిల్లాలలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో అరాచకం సృష్టించాలని చూస్తున్నారు. అభివృధ్ది కోసం తెలుగుదేశం పార్టీ ఆరాటం పడుతోంది. అరాచకాలు సృష్టించడమే వైసిపి కి అలవాటు. రౌడీఅనేవాడు రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు.  టిడిపి అధికారంలో ఉంటేనే శాంతిభద్రతలు.  ఆ పదేళ్లలో 200మంది టిడిపి కార్యకర్తల హత్యలు జరిగాయి.  మాఫియా రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ ను చేశారు.  మళ్లీ ఆ పరిస్థితులు రానివ్వకూడదు.  వైసిపి రౌడీయిజంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అయన సూచించారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25551
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author