ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సెల్యూట్
February 26 17:10 2019

పుల్వామాపై దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తూ.. ముష్కర మూకల్ని అంతం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్‌ బాంబుల వర్షం కురిపించి శత్రు స్థావరాలను మట్టుబెట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజామున మిరాజ్-2000 యుద్ధ విమానాలతో దాడిచేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌తో పాటూ జాతీయ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా పాక్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ స్పందించారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25559
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author