ఎట్టకేలకు రైల్వే జోన్ ఖరారు

ఎట్టకేలకు రైల్వే జోన్ ఖరారు
February 28 14:01 2019

దశాబ్ధాల ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ, విభాజన చట్టంలో హక్కుగా రావాల్సిన విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ ఎట్టకేలకు కేంద్రం ప్రకటించింది. ఎన్నో పోరాటాలు, ఎన్డీఏ నుంచి బయటకు రావటం, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు రావటం, ప్రజల్లో పోరాటాలు, పార్లమెంట్ లో పోరాటాలు, చివరకు ఢిల్లీలో కూడా దీక్ష చేసి, కేంద్రాన్ని దోషిగా నిలబెట్టారు చంద్రబాబు. మిగతా అన్ని హామీలు ఎలా ఉన్నా, పైసా ఖర్చు లేని ప్రత్యేక రైల్వే జోన్‌ ఎందుకు ఇవ్వరు, ఇది కక్ష కాదా అంటూ అందరూ అడుగుతూ ఉండటంతో, కేంద్రానికి వేరే దారి లేని పరిస్థితి.  ప్రధాని వైజాగ్ పర్యటన ఉంది అనగా, దాపుగా 5 ఏళ్ళ తరువాత, ఎన్నికలకు వెళ్ళే ముందు, కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది.కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ బుధవారం అధికారికంగా ప్రకటన చేశారు. కొత్త రైల్వే జోన్‌కు సౌత్‌ కోస్ట్‌ రైల్వేగా నామకరణం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌ డివిజన్లతో ఈ జోన్‌ ఏర్పాటువుతుంది. మిగిలిన కార్యక్రమాలను త్వరలోనే పూర్తి చేస్తామని గోయల్‌ వెల్లడించారు. జోన్‌ ఏర్పాటు దిశగా త్వరలోనే అధికారిక చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత వాల్తేర్‌ డివిజన్‌ను రెండు భాగాలుగా విభజిస్తామన్నారు. ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లో కలిపి జోన్‌లో ఉంచుతామని, మరో భాగాన్ని రాయగడ డివిజన్‌గా మారుస్తున్నామని తెలిపారు. రాయగడ డివిజన్‌ ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో భాగంగా ఉంటుందని గోయల్‌ వివరించారు.ఈ ప్రకటన పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజా నిర్ణయంతో వాల్తేరు రైల్వే డివిజన్ రద్దవుతుంది. ఈ డివిజన్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటూ ఒడిశా, ఛత్తీస్‌ఘఢ్‌లోని భాగాలను కవర్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని రెండుగా విభజించి, అందులో సగ భాగాన్ని విజయవాడ డివిజన్లో కలుపుతారు. మిగిలిన సగంతో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేసి తూర్పు కోస్తా రైల్వేలో కలుపుతున్నారు. వాల్తేరు డివిజన్ లో మూడింట రెండు వంతులు ఒరిస్సాకి కేటాయించంతో, ప్రధాన లాభాలు అన్నీ ఒరిస్సాకి వేల్లిపోతాయని అంటున్నారు. లాభాలు తెచ్చే డివిజన్ లోని కిరండల్ ఇనుము ఖనిజం మూలంగా వచ్చే ఆదాయాన్ని రాయగడ్ కు తరలించారు. 80 శాతం ఆదాయాన్ని పాలకుండ లాంటి భాగం రాయ్ గడ్ కు వెళుతుంది…ప్యాసింజర్ ల పై వచ్చె ఆదాయమే కోస్టల్ రైల్వే జోన్ మనది.. మళ్ళీ కష్టపడి కోస్టల్ రైల్వే జోన్ ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలుగుప్రజలదని నిరూపించుకోవాలి… ఉత్తరాంధ్ర ప్రజల కల పాక్షికంగా నెరవేరుతోంది… రైల్వేలో ఉద్యోగాలు వచ్చే అవకాశంతో కొంతలోకొంత యువకులలో ఉత్సాహం నెలకొననుంది.. అయితే ఇదే స్పూర్తితో, పోరాడి, మిగతా హామీలు కూడా సాధించుకోవాల్సిన పరిస్థతి మన రాష్ట్ర ప్రజలది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25578
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author