పోలీసుల అదుపులో నిందితుడు

October 09 11:12 2017

ిజయవాడ దుర్గ గుడి ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యం లో అర్థరాత్రి 12 గంటల తర్వాత భారీ వాహనాలను అనుమతించాలని సిటీ పోలీస్ కమీషనర్ గౌతం సవాంగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాత్రి ఇబ్రహింపట్నం రింగ్ రోడ్ వద్ద రమణ అనే కానిస్తేబుల్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రాత్రి 10 గంటల సమయంలో టిప్పర్ దూసుకురావటంతో పోలీసులు నిలువరించారు. రాత్రి 12 తర్వాతే నగరంలోకి వెళ్ళాలని డ్రైవర్ కి సూచించారు. డ్రైవర్ పోలీసుల మాట వినకుండా టిప్పర్ను ముందుకు పోనించాడు. దాంతో కానిస్తేబుల్ రమణ వాహనాన్ని ఆపి ఎస్ఐ తో మాట్లాడమని చెప్పాడు. డ్రైవర్ సెల్ ఫోన్ లో టిప్పర్ ను ఆపారంటూ యజమానికి సమాచారం అందించాడు. కొద్ది నిముషాల లోనే అక్కడికి చేరుకున్న అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఓనర్ జాస్తి పార్థ సారథి పోలీసులను దుర్భాషలాడాడు. దళిత కానిస్తేబుల్ రమణ పై దాడికి దిగాడు. దీనిపై రమణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చారు. అయితే ఆధికార పార్టీ నేతల ఒత్తిడితో విషయాన్ని గోప్యంగా ఉంచారు.

పోలీసుల అదుపులో నిందితుడు :- జాస్తి పార్ధ సారధి ( టిప్పర్ లారీ యజమాని, చూడండి కుర్చీలో కూర్చోబెట్టి మరీ రాజ మర్యాదలు చేస్తున్న పోలీసులు )

Complient:- Ramana
crime no:- 549/2017
Under section :- 323,341,506 and 353 IPC
Accused :- jasti. Pardha saradhi

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2560
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author