బాహుబలి రికార్డులుపై సైరా కన్ను

బాహుబలి రికార్డులుపై సైరా కన్ను
March 02 16:46 2019

స్తుతం టాలీవుడ్ మెగా ఫాన్స్ అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మొట్ట మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, తమన్నా వంటి స్టార్లు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించనున్నారు. రామ్ చరణ్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం 40 కోట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే అంత ఖర్చు పెట్టి కొన్నప్పటికీ సినిమా వసూళ్లు ఎంతో కొంత లాభాలు తెచ్చి పెట్టాలి అంటే ఈ సినిమా ‘బాహుబలి’ రేంజ్ కలెక్షన్లను వసూలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైతే బాహుబలి 10 మిలియన్ డాలర్లను ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. నాన్ బాహుబలి రికార్డులో 2.5 మిలియన్ డాలర్లతో ‘రంగస్థలం’ మొదటి స్థానంలో ఉంది. మరి ‘సైరా’ సినిమా ‘బాహుబలి’ రేంజి కలెక్షన్లను నమోదు చేస్తుందా లేదా అనేది ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25603
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author