వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటున్నారు

వ్యక్తిగత సమాచారాన్ని అమ్ముకుంటున్నారు
March 04 16:51 2019

రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటు సంస్దలకు ఏ విధంగా వెళ్లింది. ఈ సమాచారం అంతా ప్రగతి కోసం అని మంత్రి లోకేష్ అంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఓట్ల తొలగింపు కూడా వీరి కుట్రే అని  వైకాపా నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. -సర్వేల పేరుతో ఓటర్ల సమాచారం సేకరించారు. ఓటర్లను నాలుగు భాగాలుగా విభజించి ఓట్ల తొలగింపు చేపట్టారు. ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేని వారి ఓట్లు తొలగిస్తున్నారు. గతంలో టీచర్లు ఓటర్ నమోదు,తొలగింపు చేసేవారు.కాని ప్రస్తుతం అంగన్ వాడి ల ద్వారా చేస్తున్నారుని అయన ఆరోపించారు. వీరందరూ కూడా తాత్కాలిక ఉద్యోగులు.వీరు జన్మభూమి కమిటి సభ్యుల వత్తిడికి లొంగి పనిచేస్తుంటారు. రాష్ర్ట ప్రజల సమాచారాన్ని డేటా హబ్ లో పెట్టారు. భారతదేశ చట్ట ప్రకారం ఎక్కడ నేరం జరిగితే అక్కడ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కాని మీరు మాత్రం హైద్రాబాద్ లో నేరం జరిగినా నేను దర్యాప్తు చేస్తానంటారు. ఓటర్ల  లిస్ట్ నుంచి మీకు నచ్చని ఓటర్లను తొలగించేందుకు యంత్రాంగం తయారు చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా వెళ్లింది. విచారణలో నిజానిజాలు బయటపడతాయి.విచారణ జరుపుతుంటే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు సంస్దలకు అమ్ముకుంటున్నారు. వ్యక్తిగత సమాచారం దొంగింలించినందుకు మీకు అభినందనలు తెలిపాలా? బ్లూప్రాగ్ ,ఐటి గ్రిడ్ సంస్దలకు  ఈ  సమాచారం ఇచ్చారు. వీరు ఎవరు అంటే ఎప్పుడు సిిఎం పేషిలో కనిపిస్తుంటారు. ఈ సంస్దలకు అనేక పనులు ఇచ్చారు.30 కోట్ల రూపాయలకు పంటలకు సంభందించి ఓ కాంట్రాక్ట్ ఇచ్చారు. రాష్ర్టంలో ఉండే ప్రతి కరెంట్ పోల్ కు జియే టాగ్ వేయాలని కాంట్రాక్ట్ ఇచ్చారు. 2014 ముందు ఐటి గ్రిడ్ ఎప్పుడైనా వ్యాపారం చేసిందా అంటే అదీ లేదు. -మీ ప్రభుత్వం వచ్చాక ఏర్పాటైనా కంపనీ.అంటే మీ కోసమే ఇది ఏర్పాటుచేసినట్లు కనిపిస్తోంది కదా? డేటా చోరీ విషయం బయటకు రాగానే యాప్ నుంచి డేటా ఎందుకు తీశేశారరి అడిగాకె. పౌరుల ఆధార్ కార్డుల సమాచారం ఐటి గ్రిడ్స్ సంస్ధకు ఎలా వెళ్లింది. – సేవామిత్ర యాప్ డౌన్ లోడ్ చేస్కున్న ప్రతి ఒక్కరి డేటా ఐటి గ్రిడ్స్ వద్ద ఉంది. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు,బ్యాంక్ అకౌంట్స్ ఐటి గ్రిడ్స్ వద్ద ఉన్నాయి. -అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మీ వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది.బ్యాంక్ అకౌంట్ల పాస్ వర్డ్స్ మార్చుకోండి. డేటా పట్ల అప్రమత్తంగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నా. -ఈ కుంభకోణం బయటకు రాగానే ప్రజలను కన్ఫ్యూజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదేమంటే టిడిపి డేటా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రకటనలు చేస్తున్నారు. టిడిపి డేటా గురించి మేం మాట్లాడటం లేదు.ప్రజలకు సంభందించిన రహస్యంగా ఉండాల్సిన డేటా బయటకు ఎలా ఇచ్చారనేది మా ప్రశ్న అని అన్నారు. దీనిపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి.నాలుగు కోట్ల ప్రజలకు సంభందించిన అంశం. ఏపి ప్రభుత్వం తప్పు చేయలేదంటే విచారణకు సిధ్దపడాలి.ఏం జరిగింది?భాధ్యులెవరు అనేది బయటకు రావాలి. టిడిపి అంటే తెలుగుప్రజల సమాచారం దొంగిలించే పార్టీ వ్యక్తిగత సమాచారం గోప్యత ప్రజల ప్రాధమిక హక్కు.  తన కిష్టం లేని ఓట్లను తొలగించేందుకు టిడిపి ఏకంగా ఓ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసింది. -సేవామిత్ర యాప్ మన ఫోన్ లో ఉంటే మన ఆనుపానులు మొత్తం తెలిసిపోతుంది. సేవామిత్ర యాప్ లోకి కలర్ ఫోటోలు ఎలా వెళ్లాయి.  టిడిపి కార్యకర్తలకు సైతం వారి బ్యాంక్ వ్యవహారాలు అన్ని వారికి తెలిసిపోతున్నాయే తెలియదని అన్నారు. సత్యన్నారాయణ గారు అనే వ్యక్తి పదవీ విరమణ చేసిన ఐ ఏ ఎస్ అధికారిని తర్వాత ఆయనను తీసుకువచ్చి తిరిగి ఏపి ప్రభుత్వం సలహాదారుగా సర్వీసులు  ఉపయోగించుకుంటోంది. ఆయనకు హైద్రాబాద్ లో స్ధలం ఇచ్చారు.అమరావతిలో స్ధలం ఇచ్చారు. సలహాదారుగా ఉంటూ ఆధార్ గౌరవాధ్యక్షుడుగా ఉంటున్నారు.కాబట్టి ఆయనను ఆ పోస్టునుంచి తొలగించాలని కోరుతున్నాం. ఐటి గ్రిడ్ కుంభకోణంపై ఆధార్  సంస్ధ….ఎన్నికల కమీషన్ ….సైబర్ క్రైమ్…పోలీసు విచారణలు జరపాల్సిందే. మీరు ఇది బయట పడగానే ఎందుకు అన్ని మార్పులు చేస్తున్నారని అన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25627
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author