శశికళపెరోల్‌ గడువు ముగిసిన తర్వాత…

శశికళపెరోల్‌ గడువు ముగిసిన తర్వాత…
October 09 19:20 2017
 జైలు నుంచి చెన్నై చేరుకున్న శశికళ నగర శివారు పెరుంబాక్కంలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్త నటరాజన్‌ను పరామర్శించిన విషయం తెలిసిందే.అక్కడి నుంచి చెన్నై టీనగర్‌ హబీబుల్లా రోడ్డులోని మేనకోడలు నివాసంలో బసచేసారు. ఆమె నివాసం వద్ద సుమారు 50 మంది నిర్వాహకులు ‘చిన్నమ్మ’ రాక కోసం నిరీక్షించారు. అదే సమయంలో కొందరు ఇంటెలిజెన్స్‌ అధికారులు మఫ్టీలో శశికళ, ఆమె మద్దతుదారుల కదలికలపై నిఘా ఉంచారనే వార్తలు వినిపిస్తున్నాయి. నటరాజన్‌ను చూసేందుకు ఆస్పత్రికి వెళ్లే సమయంలో శశికళ పెరోల్‌ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. శశికళ కారుతోపాటు మరో మూడు వాహనాలు మాత్రమే వెళ్లాలని కర్ణాటక జైళ్ల శాఖ నిబంధనలు విధించిందని, అయితే ఏడు కార్లు వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఆంక్షలు బేఖాతరు చేస్తూ సుమారు 100 మంది మద్దతుదారులు ఆస్పత్రిలోకి చొరబడ్డారు. ఆస్పత్రిలో టీటీవీ దినకరన్‌ తమ్ముడు భాస్కరన్‌, దినకరన్‌ బావ డాక్టర్‌ వెంకటేశ్‌, మద్దతు ఎంపీలు ఇద్దరు, అనర్హతవేటుకు గురైన ఓ ఎమ్మెల్యే, ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.
శశికళతో కొందరు ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు భేటీకి యత్నిస్తున్నారని, తన మేనల్లుడు జై ఆనంద్‌ ద్వారా శశికళ రాజకీయ వ్యవహారాలు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. పెరోల్‌ గడువు ముగిసి చిన్నమ్మ జైలుకెళ్లిన తర్వాత చక్రం తిప్పడానికి అనువుగా టీగర్‌ నివాసం కేంద్రంగా ప్రస్తుతం సన్నాహాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. దీని గురించి టీటీవీ దినకరన్‌ వర్గం అధికారప్రతినిధి నాంజిల్‌ సంపత్‌ను విలేకర్లు ప్రశ్నించగా…. నిబంధనల ప్రకారం శశికళ ఎవరినీ కలవకూడదని, అయితే ఆమెను ఎవరైనా కలవవచ్చంటూ పేర్కొనడం చర్చనీయంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=2563
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author