ఏజెన్సీల చేతి వాటం గ్రేటర్ ఆదాయానికి భారీగా గండి

ఏజెన్సీల చేతి వాటం గ్రేటర్ ఆదాయానికి భారీగా గండి
March 05 13:00 2019

తాగునీటి సరఫరాలో మీటర్ రీడింగ్‌లో పెద్ద ఎత్తున గోల్ మాల్‌లు జరుగుతున్నాయి. ఫలితంగా వాటర్ బోర్డుకు కోట్లల్లో నష్టం వాటిల్లుతుంది. జలమండలి ఆదాయంలో బిల్లుల జారీ, వసూళ్లలో ఏజెన్సీలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతో సంస్ధ ఖజనాకు లోటు ఏర్పడుతుంది. నీటి వినియోగం బిల్లులను గుడ్డిగా జారీ చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అరకొర రాబడులను సక్రమంగా బిల్లుల జారీ, వసూళ్లు జరిగేలా బోర్డు దృష్టి కేంద్రీకరించింది. ఈ క్రమంలో క్షేత్రస్ధాయిలో తనిఖీలు నిర్వహించాలని విజిలెన్స్ అధికారులకు ఎండీ ఎం. దానకిషోర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.నల్లా బిల్లుల జారీ, వసూళ్లలో నిర్లక్షంగా వ్యవహరిస్తున్న ఏజెన్సీల పని తీరును మెరుగుపర్చే దిశగా జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సంబంధిత ఏజెన్సీలను సమావేశపర్చి పరిస్థితిని అధ్యాయనం చేసినట్టు తెలిసింది. దీంతో ఏజెన్సీల పనితీరుపై నిఘా విధించేందుకు ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నట్టు విశ్వనీయ సమాచారం. ఇందులో భాగంగా ప్రతి నెల సమీక్షించడంతో పాటు నల్లా కనెక్షన్ కలిగిన ప్రతి ఒక్క ఇంటిని కచ్చితంగా పరిశీలించే విధంగానూ, కేటగిరీల వారీగా నల్లా జాబితాను బోర్డు ఉన్నతాధికారులకు నివేదికల రూపంలో సమర్పించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఇందుకు విరుద్ధంగా వ్యవహరించే ఏజెన్సీలను బ్లాక్ లిస్టులో పెట్టే దిశగా బోర్డు కసరత్తు చేపట్టింది. ముఖ్యంగా ఏజెన్సీల పనితీరుపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్టు తెలిసింది.హైదరాబాబాద్ పరిధిలో జలమండలి కేటగిరీల వారీగా నల్లాల బిల్లులను వసూలు చేస్తుంది. గృహా, వాణిజ్య వినియోగాలకు వేర్వేరుగానూ బల్క్ రూపంలో కమర్షియల్, డొమెస్టిక్ కేటగిరిల్లో నల్లా కనెక్షన్లను మంజూరు చేస్తారు. ఆయా కనెక్షన్లను కేటగిరీల వారీగా విభజించి మరీ సంబంధిత వినియోగదారుల నుంచి నెలవారీగా నల్లా బిల్లులను వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని శివారు గ్రామాలను కలుపుకుని 9.6లక్షల నల్లా కనెక్షన్లను మంజూరు చేశారు. దీంతో నగరంలోని 15 నియోజకవర్గాలతో పాటు నగర శివారు ప్రాంతమైన దాదాపుగా 13 మున్సిపాలిటీలకు విస్తరించాయి. తద్వారా బోర్డుకు ప్రతి నెలా బిల్లులు జారీ, వసూళ్లు చేసేందుకు నల్లా కనెక్షన్లకు రీడింగ్ మీటర్లను అమర్చారు. ఈ మీటర్ల ద్వారా వినియోగదారులు ఎంత మేరకు నీటి వాడారో స్పష్టమైపోతుంది.అంతే కాకుండా ఆ కనెక్షన్ ఏ కేటగిరిలో ఉందో కూడా తెలిసిపోతుంది. ఇంతటి గురుతర బాధ్యతను బోర్డు ప్రైవేటు ఏజెన్సీల చేతుల్లో పెట్టింది. మొత్తం 20 డివిజన్ల పరిధిలో మీటర్ రీడింగ్, బిల్లుల జారీ, వసూళ్ల ప్రక్రియను నిర్వహించేందుకు 12 ఏజెన్సీలకు అప్పగించింది. దీంతో ఆయా ఏజెన్సీలు నెలనెలా ఇంటింటికి వెళ్లి నల్లా కనెక్షన్‌ను పరిశీలించి మీరీ నీటి వాడకంపై బిల్లులు జారీ చేయాలి. కానీ ఏజెన్సీలన్నీ బాధ్యరాహిత్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శ లేకపోలేదు.వినియోగదారునికే నేరుగా నీటి బిల్లుల వివరాలు చేరే అంశంపై సాద్యసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే వినియోగదారునికి నేరుగా నీటి బిల్లుల వివరాలు చేరేలా చర్యలు చేపట్టారు. నల్లా కేటగిరీ, మొబైల్ నంబర్ వంటి వివరాలతో కూడిన డేటాను సేకరిస్తున్నట్టు తెలిసింది. దీంతో పాటుగా నీటి కనెక్షన్ ఉన్న వినియోగదారులు రీడింగ్ మీటర్‌ను ఏర్పాటు చేసుకునేలానూ, లేనిపక్షంలో రెట్టింపు ఛార్జీలు వసూలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో విధి నిర్వాహణలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏజెన్సీలను ఉపేక్షించబోమని విజిలెన్స్ అధికారులు హెచ్చరించినట్టు సమాచారం

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25639
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author

write a comment

0 Comments

No Comments Yet!

You can be the one to start a conversation.

Add a Comment


Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 206

Warning: Illegal string offset 'rules' in /home/darknews/public_html/7gnews.in/wp-content/themes/gadgetine-theme/functions/filters.php on line 225