అగమ్యగోచరంగా మీసేవ కేంద్రాల పరిస్థితి

అగమ్యగోచరంగా మీసేవ కేంద్రాల పరిస్థితి
March 06 12:59 2019

కడప జిల్లాలోని మీసేవ కేంద్రాల పరిస్థితి రోజురోజుకు అగమ్యగోచరంగా మారింది. సేవ పేరుతో ప్రజల నుండి వేలాది రూపాయలు వసూళ్లు చేస్తున్న ప్రైవేట్ ఏజెన్సీలు, అందులో పనిచేస్తున్న సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సిబ్బందికి ఉద్యోగ భద్రత లేక, కనీస వేతనం అమలుకాక, నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియక జిల్లా వ్యాప్తంగా 59 అర్బన్ మీసేవ కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అష్టకష్టాలు పడుతున్నారు. అయితే టెండర్లు ఖరారయ్యేవరకు పాత ఏజెన్సీలే కొనసాగడం వల్ల మీసేవ కేంద్రాలు జిల్లాలో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం ఈసారి టెండర్ల ద్వారా బహుళ జాతి కార్పొరేటర్లకు అప్పగించాలని చూస్తోంది. అర్బన్ మీసేవ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది మాత్రం ఈకేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలని, కనీస వేతనం అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు మీసేవ కేంద్రాల ద్వారా 400 రకాల సేవలు అందిస్తున్నామని, 2003వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం మీసేవ కేంద్రాలు ప్రారంభించిందని కడప నగరంలోని కొంతమంది మీసేవ కేంద్రాల నిర్వాహకులు  తెలిపారు. ప్రభుత్వానికి, వినియోగదారులకు మద్య వారధిగా అన్ని సేవలు ఒకేచోట ఉండేలా తాము సేవలందిస్తున్నామని కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది తెలుపుతున్నారు. ప్రభుత్వ రంగంలో నడిచిన ఈ కేంద్రాలను ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సర్వర్ మెయింటినెన్స్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. అప్పట్లోనే సీఐటీయూ ఆధ్వర్యంలో 97 కాంట్రాక్టు లేబర్ యాక్టును మీసేవ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి వర్తింపచేయాలని తాము సమ్మె చేస్తున్నట్లు కొంతమంది నిర్వాహకులు తెలుపుతున్నారు. చంద్రన్న పెళ్లికానుక, యువనేస్తం, చంద్రన్నబీమా, పట్టాదారు పాసుపుస్తకాలు, ల్యాండ్ రెగ్యులేషన్ వంటి ధృవపత్రాలే కాకుండా కుల ధృవీకరణ, పుట్టినరోజు సర్ట్ఫికెట్లు, ఆదాయపు సర్ట్ఫికెట్లు, కుటుంబ వార్షికోత్సవ సర్ట్ఫికెట్లను అనేక కీలక ప్రభుత్వ సేవలు మీసేవ ద్వారా సిబ్బంది ప్రజలకు అందజేస్తోంది. మీసేవ సిబ్బంది సమస్యలపై ఈనెల 28వ తేదీలోగా ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకుని ఉద్యోగ భద్రత, వేతన నియమావళిని అవలంభించి ఆదుకోవాలని మీసేవ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25672
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author