నాన్న చావును రాజకీయం చేస్తున్నారు

నాన్న చావును రాజకీయం చేస్తున్నారు
March 20 14:10 2019

ఆయనకు ఎప్పుడు ప్రజలే ముందు. ఆయన ఎప్పుడూ ప్రజల మనిషని వైఎస్ వివేకానంద కుమార్తే సునీత అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అమ్మ అనారోగ్యం కారణంగా నా దగ్గరే ఉండేది. కాబట్టి నాన్న ఒక్కడే ఇంట్లో ఉండేవాడు. సంఘటన జరిగిన తరువాత టీవీలలో చూసి జరిగే సంఘటనలు చూసి ఇంకా బాధ ఎక్కువ అయింది చనిపోయిన మా నాన్న గురించి కొందరు మాట్లాడటం చూస్తే ఎంతో బాధ గా ఉందని ఆమె అవేదన వ్యక్తం చేసారు.. ఇలాంటి ఆరోపణలు జరిగితే ఇన్వెస్టిగేషన్ నిజంగా ఎలా జరుగుతుందని అన్నారు. కుటుంబం గురించి నెగటివ్గా ప్రచారం చేయడం మంచిదేనా? అని ఆమె అన్నారు. జగనన్న సీఎం కావాలని మా నాన్న కష్టపడేవాడు. దీనిపై ఓ వర్గం మీడియా ఎన్నో వ్యతిరేక వార్తలను ప్రసారం చేస్తోందని, ఇది ఎంతమాత్రమూ సరికాదని అన్నారు. మా నాన్న చావును కూడా రాజకీయ విమర్శలకు వాడుకోవడం దుర్మార్గం. మా కుటుంబంలో గొడవలు అని సృష్టించి అసత్య ఆరోపణలు చేస్తున్నారు మా కుటుంబంలో 700 మంది సభ్యులం ఉన్నాం. తన తండ్రికి ఎవరితోనూ శత్రుత్వం లేదని, బెంగళూరులో ఉన్న భూమిపై వివాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించారు.ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళే నిజ నిజాలు బయటపెడతారని ఆమె అన్నారు. 

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25810
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author