టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం

టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం
March 21 16:54 2019

హైదరాబాద్ నుండి కష్ట కాలంలో ఆంధ్రులను తరిమి కొట్టారు. ప్రతి ఒక్క కుటుంబానికి పెద్ద కొడుకుగా వుంటాను. నాకు 98లక్షల మంది  తోబుట్టువులు వున్నారు.డ్వాక్రా మహిళలకు ఒక అన్నగా వుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అయన నూజివీడులో పార్ట ఎన్నికల ప్రచార బహిరంగ సభలో మాట్లాడారు. రైతు బిడ్డలకు పెద్దన్నగా వుంటాను.అన్నదాత సుఖీభవ రాబోయే ఖరీఫ్ సీజన్ కు పెట్టు బడి రుణం అందిస్తాo. యువతకు భవిష్యత్ దారి చూపి గార్డియన్ గా వ్యవహరిస్థానని అన్నారు. జగన్ ను నమ్ముకుని పారిశ్రామిక వ్యక్తులు జైలు పాలయ్యారు. రాజధాని నిర్మాణంకు రైతులు నుండి  35వేల ఎకరాలుకు 55వేల కోట్లు అప్పు చేసి సింగపూర్ సహకారంతో అమరావతి శ్రీకారం చుట్టాం. పోలవరం, పట్టిసీమ, కృష్ణా, పెన్నా, వంశాధార వంటి 62 ప్రాజెక్ట్  లు చేపట్టామని అయన అన్నారు. అన్న క్యాంటీన్, ఆహార భద్రత, నిరుద్యోగభృతి, కరెంట్ ,కేబుల్, గ్యాస్, స్కూల్స్, స్మశానం అభివృద్ధి పరిచాo. ఇంటింటి మంచి నీటి వసతి కి 25కోట్లకు టెండర్లు పిలిచాo. ఆడబిడ్డలకు వైద్యం అందిస్తూన్నామని అన్నారు.  మీ అభిమానం కేరింతల చూస్తుంటే ఉత్సాహం పొంగుతోంది. ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి కూడా గెలుస్తానన్న నమ్మకం కలుగుతుంది. ఈరోజు అందరూ ఎమ్మెల్యే అభ్యర్థులకు బి ఫాం ఇచ్చి ప్రతిజ్ఞ జయించానని అని చెప్పారు. గెలవటం చారిత్రక అవసరమని అన్నారు  ఇది ఒక పార్టీ కాదు ఒక వ్యక్తి కాదు ఐదు కోట్ల మంది ప్రజల ఎన్నిక అన్నారు.  దొంగల పార్టీ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడమంటున్నారు అలా చేస్తే మన మరణ వాంగ్మూలం మనమే రాసుకున్నట్టు అన్నారు.  పద్ధతిలేని విభజన జరిగింది వెంకన్న సాక్షిగా మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి  నరేంద్రమోడీ. హైదరాబాద్ ఎవరు అభివృద్ధి చేశారో అందరికీ తెలుసు అన్నారు. వట్టి చేతులతో బయటకు పంపించారు విభజన హామీలు నెరవేర్చలేదు . అనుభవం ఉన్న నన్ను గెలిపించండి మీ ఇంటి పెద్ద కొడుకుని అవుతారన్నారు.  డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలని చంద్రబాబు అన్నారు. -ఘోరాలు చేయడంలో  జగన్ పి హెచ్ డి చేశాడు. సొంత బాబాయి ని చంపి రాజకీయాలు చేసే సంస్కృతి  జగన్ ది అని విమర్శించారు. 

👉

కేసీఆర్ నోరు పారేసుకున్నాడు ఆంధ్ర వాళ్ళు రాక్షసులు అంటున్నాడు. ఆంధ్రాలో ఫ్యాను తెలంగాణలో స్విచ్ ఢిల్లీలో కరెంటు ఉంటుందని  అన్నారు  దేశాన్ని కాపాడమని ప్రధానమంత్రిని చేస్తే దొంగల కాపాడుతున్నారు మోడీని ఎద్దేవా చేశారు . ఈ కార్యక్రమంలో లో దేవినేని ఉమామహేశ్వరరావు,  నందమూరి తారక రత్న,  సినీ నటి దివ్య వాణి,  ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25818
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author