నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్
March 23 15:29 2019

ఫామ్ 7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవే..వివరాలు ప్రకటించిన ఏపీ ఎన్నికల సంఘం..విజయవాడ, మార్చి 23 (న్యూస్ పల్స్)ఏపీలో ఏఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నామో జాబితాను  ఏపీ ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే..  ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా,వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ఈసీ ప్రకటించింది.ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. శ్రీకాకుళం – 2,579, విజయనగరం- 5,166, విశాఖపట్నం- 2,407, పశ్చిమ గోదావరి- 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684,  అనంతపురం- 6,516,  గుంటూరు- 35,063, తూర్పుగోదావరి- 24,190,  కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు వున్నట్లు ఈసీ వెల్లడించింది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25823
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author