దేశం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటోంది: మంత్రి అల్లోల

March 26 17:37 2019

దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ముధోల్  నియోజకవర్గ పార్లమెంటరీ సన్నహాక సమావేశాన్ని కుబీర్, ముధోల్, బాసర, మండలాల ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగున్నర ఏళ్లలోనే అభివృద్ది, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ఆదర్శంగా నిలిచి నెంబర్ వన్గా నిలిచిందన్నారు. సీఎం కేసీఆర్ తలపెడుతున్న చారిత్రాత్మకమైన సంక్షేమ పథకాలతో తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందన్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడించారు. 2 ఎంపీ సీట్లతో ప్రత్యేక తెలంగాణ సాధించిన సీయం కేసీఆర్ 16 ఎంపీ సీట్లతో కేంద్రంలో  ప్రధాన భూమిక పోషిస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఈ ఎన్న్నికల్లో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్పుతారన్నారు. కాంగ్రెస్,బీజేపీ  ఎంపీ అభ్యర్థులు రాథోడ్ రమేష్, సోయం బాపురావు  మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఘోరంగా ఓటమిపాలయ్యారని…. ఎమ్మెల్యేలుగా గెలవని వారిని ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దింపాయని విమర్శించారు. వారిద్దరు ఇప్పుడు చెల్లని రూపాయని ఎద్దేవా చేశారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరున్న నగేష్ పార్లమెంటరీ ఎన్నికల్లో గెలవడం ఖాయమని, నాలుగు లక్షల మెజార్జీతో ఆయనను గెలిపించుకుందామని కార్యకర్తలకు పిలుపినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి నగేష్, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ ఇంచార్జ్ డి.విఠల్ రావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమతి చైర్మన్ నల్లా వెంకట్రామ్ రెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25842
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author