తొలి సంతకం రైతు పెన్షన్ ఫైలు పైనే

తొలి సంతకం రైతు పెన్షన్ ఫైలు పైనే
March 27 16:49 2019

60 ఏళ్లు నిండిన రైతులకు  ఐదు వేలు ఫెన్షన్ ఇస్తా. నేను సిఎం అయిన వెంటనే తొలిసంతకం రైతుల ఫెన్షన్ పైన్నే పెడతానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం అయన గిద్దలూరులో ప్రచారం నిర్వహించారు. ఉద్దానంలాంటి సమస్యలు లు గిద్దలూరును వెంటాడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాదిగ్రస్తుల కోసం ఐదువందల కోట్లు కేటాయిస్తాం. మా తండ్రి గిద్దలూరులో కానిస్టేబుల్ గా పనిచేశారు. జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే 3 లక్షల ఉద్యోగాలను భర్తి చేస్తామని అయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ను 18నెలల్లో పూర్తి చేస్తాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలెండర్ పంపిణీ చేస్తాం. కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తాం. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా గుర్తిస్తాం. యువతకు స్కిల్ డెవలప్ మెంట్లో శిక్షనను ఉచితంగా ఇప్పిస్తాం. నేను ఒంటరిగా వచ్చాను…మిమ్మల్ని నమ్మే వచ్చాను. పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాలను పెంపొందిచే చర్యలు చేపడతాం. శిద్దా రాఘవరావులా వందల కోట్లు పెట్టే వ్యక్తికాదు జనసేన ఎంపీ అభ్యర్ధి బెల్లంకొండ సాయిబాబ. యువతకు జనసేన అండగా ఉంటుందని అయన అన్నారు..

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25864
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author