హామీల ముసుగులో మరోసారి మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం

హామీల ముసుగులో మరోసారి మోసం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
April 02 20:01 2019

హైదరాబాద్ ఏప్రిల్ 2  (న్యూస్ పల్స్)   హామీల ముసుగులో తెలంగాణా ప్రజలను టిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తుందని మాజీ శాసనసభ్యులు మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు.మంగళవారం బంసిలాల్పేట్ డివిజన్లోని పద్మారావు నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి హమాలి బస్తీ, వెంకటాపురం కాలనీ, సాయిబాబా గుడి వాకర్ టౌన్. పద్మారావు నగర్ పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు  అమలుకు నిచుకొని హామీలు ఇచ్చి టీఆరెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.డబలు బెడ్ రూమ్ ఇల్లు కట్టడం  ఈ బడ్జెట్ తో అసాధ్యం ప్రజలను హామీల ముసుగులో మరోసారి మోసం  చేసే ప్రయత్నం చేస్తున్నారు.ఆరుగురు కుటుంబ సభ్యులు ఎక్కడ ఒక రాష్ట్రాన్ని శాసించడం  నేను ఎక్కడ చూడలేదన్నారు. నాకోసం కాదు ప్రజాస్వామ్య బతకడం కోసం బతికించుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు.ఓటర్లను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి, అంజన్ కుమార్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెదేపా నాయకులు కృష్ణ పూజారి కే . శ్యాం, రాందాస్, రాజు, పాల్గొన్నారు================================Attachments area

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25936
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author