తెరాస లో చేరికలు

తెరాస లో చేరికలు
April 02 20:11 2019

హైదరాబాద్ వివేకానందనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ రంగారావు  ఆధ్వర్యంలో కూకట్ పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కి చెందిన 50 మంది టీడీపీ  పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున  శాసన సభ్యుడు ఆరేకపూడి గాంధీ  సమక్షంలో తెరాస పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ని  భారీ మెజారిటీ తో గెలిపించి  ముఖ్యమంత్రి  కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరు సైనికుడిగా పనిచేయాలని, తెరాస పార్టీని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో బాగస్వాములవుతామన్నారు.  ముఖ్య మంత్రి కెసిఆర్   బంగారు తెలంగాణ నిర్మాణం కోసం  ఎంతగానో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ  కార్పొరేటర్ రంగారావు, తెరాస నాయకులు సంజీవరెడ్డి వార్డ్ మెంబర్ ఎల్లం నాయుడు, చంద్ర మోహన్ సాగర్, పోతుల రాజేందర్,విద్య సాగర్,  టీడీపీ పార్టీ నుండి తెరాసలోకి చేరిన ప్రముఖులు ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ,గణపతి,సత్తయ్య,ఈశ్వర్ రావు,రమేష్,ఋషి,తులసి రావు తదితరులు పాల్గొన్నారు.===================

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25944
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author