అద్దంకిలో సద్దుమణిగిన గ్రూపుల గోల

అద్దంకిలో సద్దుమణిగిన గ్రూపుల గోల
April 03 11:29 2019

అద్దంకిలో గ్రూపుల గోల సద్దుమణిగింది. కరణం, గొట్టిపాటి వర్గీయుల మధ్య అనాదిగా నెలకొన్న వైరం దూరమైంది. అంతా కలిసిపోతున్నారు. ఒక్కటిగా ముందుకు సాగుతున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం, అందుకు అనుగుణంగా అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్‌ వైరి వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం అందుకు కారణమైంది. అనేక గ్రామాల్లో రెండు గ్రూపులు కలిసి పోవవడంతో ప్రశాంతత నెలకొంటోంది. కొద్ది గ్రామాల్లో మాత్రం ఇంకా టెన్షన్‌ కొనసాగుతోంది. అద్దంకి నియోజక వర్గంలో దశాబ్దాల నుంచి కరణం, గొట్టిపాటి వర్గీ యుల మధ్య వైరం ఉంది. ప్రస్తుతం ఇరువురు నా యకులు ఒకే పార్టీలో ఉండి పనిచేసేలా చేయటంలో చంద్రబాబు రచించిన వ్యూహం ఫలించింది.ఎన్నికల పుణ్యమా అని అది మరింత సర్దుబాటుకు దారితీసింది. గత ఎన్నికల అనంతరం నెలకొన్న పరిణామాల్లో గొట్టిపాటి రవికుమార్‌ను సీఎం చంద్రబాబు పార్టీలోకి చేర్చుకున్నారు. రవికుమార్‌ టీడీపీలోకి చేరడంతో మళ్లీ పార్టీలో గొడవ మొదలైంది. ఆ సమయంలో రెండు కత్తులు ఒక వరలో ఎలా ఇమ డవో అలానే ఇరువర్గీయులు తెలుగుదేశంలో కొన సాగటం కష్టమే అని పలువురు వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు మాత్రం ఇరువురికీ న్యాయం చేస్తానన్న హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే బల రాంకి ఎమ్యెల్సీ పదవి ఇచ్చారు. అదే సమయంలో కరణం వెంకటేష్‌కు న్యాయం చేయాలన్న ఉద్దేశం తో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌ చైౖర్మన్‌గా నియమించారు.ఇక ప్రస్తుతం చీరాల నుంచి బల రాంను పోటీకి దించటం ద్వారా ఇరువర్గీయులకు ప్రాధ్యాన్యం ఇచ్చినట్లయింది. దీంతో కరణం వర్గీ యులు కూడా సంతృప్తిచెందారు. అద్దంకి నియో జకవర్గంలోని అనేక గ్రామాల్లో గతంలో ఉన్న వర్గ విభేదాలకు ఫుల్‌స్టాప్‌ పడి ఇరువ ర్గాల నాయకులు కలసి ముందుకు సాగుతున్నారు. గతంలో వర్గ విభేధాలతో అట్టుడికి గ్రామాల్లో ప్రశాంత వాతా వరణం ఏర్పడుతోంది. రెండు వర్గాలను కలుపుకొని పోయే విషయంలో ఎమ్మెల్యే రవికుమార్‌ కూడా విజ్ఞతతో వ్యవహరిస్తున్నారు. గ్రామాలలో అందరినీ ఏకం చేస్తున్నారు. కొద్ది గ్రామాల్లో మాత్రం టెన్షన్‌ వాతావరణం ఉంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=25972
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author