పార్టీలకతీతంగా మద్దతుంది

పార్టీలకతీతంగా మద్దతుంది
April 03 12:46 2019

పాలమూరు  జిల్లాలో అనేక సమస్యలపై పోరాటం చేశా. సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఉద్యమం చేశా. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉన్నానని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధి డీకే ఆరుణ అన్నారు. బుధవారం ఆమె మీడీయాతో మాట్లాడారు.  నీళ్లు, నియామకాలు, నిధులను పక్కన పెట్టి నిజాం పాలనను కేసీఆర్ గుర్తు చేస్తున్నారు.  తెరాసను ఎదుర్కొనే శక్తి భాజపాకు మాత్రమే ఉంది. పార్టీలలకు అతీతంగా ప్రజలు నాకు మద్దతు ఇస్తున్నారని అన్నారు.  దేశంలో స్థిరమైన పాలన, సమగ్రత, అన్ని వర్గాలకు న్యాయం నరేంద్ర మోదీకే సాధ్యం. రాష్ట్రంలో రూ.రెండున్నర లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ప్రభుత్వం జీతాలు ఇచ్చే స్థితిలో లేదని అన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే అభివృద్ధిలో ముందుకుపోతుంది. మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నాం. తెలంగాణలో భాజపానే ప్రత్యామ్నాయం అన్న విషయాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని అన్నారు.  చదువుకున్న వారికి ఉపాధి లభించడం లేదు. పాలమూరులో పరిశ్రమలు తక్కువగా ఉన్నాయి. నేను గెలిస్తే జిల్లాకు పరిశ్రమలు వచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తానని అన్నారు.  ఫార్మా కంపెనీలు వస్తే ఈ ప్రాంతం అంతా కాలుష్య కారకంగా మారుతుంది. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉపాధి అవకాశాల కోసం ప్రజలకు ఇబ్బందులు కలుగని పరిశ్రమలను తీసుకొస్తాం. ముందుగా ఈ ప్రాంతానికి సాగునీరు వస్తే ఉపాధి పెరిగి, వలసలు తగ్గుతాయని అన్నారు.  జిల్లాలో ప్రవహిస్తున్న కృష్ణా నదిలో నీటి ప్రవాహం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ కృష్ణా, గోదావరి నదుల అనుసంధానానికి ప్రణాళిక రూపొందిస్తున్నారు. వికారాబాద్, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రాంతాలు సాగు, తాగునీరు లేక వెనుకబడి ఉన్నాయి. ఇక్కడ నాపరాయి గనులు ఉండటంతో ఆ పరిశ్రమలు వచ్చేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.రైతులు సుభిక్షంగా ఉండాలంటే సాగునీరు అందాలి. ప్రాజెక్టు పనులు పూర్తి కావాలి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాల్సింది కేంద్రమే. వచ్చేది భాజపా ప్రభుత్వమే. ఈ పథకాన్ని రెండు దశలుగా విభజించాలి. జూరాల నుంచి మహబూబ్నగర్, మరోదశలో శ్రీశైలం తిరుగుజలాల ద్వారా నాగర్కర్నూలుకు నీటిని సరఫరా చేయాలి. కృష్ణాలో నీళ్లు తగ్గిపోతున్న దృష్ట్యా గోదావరి నీటిని నదుల అనుసంధానంతో కృష్ణాకు తీసుకురావాల్సిన అసవరం ఉంది. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తానని ఆరుణ అన్నారు

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26027
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author