జీఆర్ఎస్ఈ ద్వారా 100వ యుద్ధ‌నౌక‌ భారతీయ నేవీకి అందజేత

జీఆర్ఎస్ఈ ద్వారా 100వ యుద్ధ‌నౌక‌ భారతీయ నేవీకి అందజేత
April 03 16:47 2019

గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఆండ్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (జిఆర్ఎస్ఇ), మినీర‌త్న కేట‌గిరీ 1 మ‌రియు భార‌తదేశ ర‌క్ష‌ణ శాఖ సార‌థ్యంలో ప‌నిచేసే ప్ర‌ముఖ యుద్ధనౌక‌ల నిర్మాణ కంపెనీ త‌న వందో యుద్ధ నౌక‌ను భార‌త వైమానిక ద‌ళానికి అందించింది. ఈ చ‌ర్య ద్వారా జీఆర్ఎస్ఈ భార‌త‌దేశంలోనే 100 యుద్ధనౌక‌ల‌ను రూపొందించి భార‌త నౌకాద‌ళానికి, భార‌త తీర ర‌క్ష‌క ద‌ళానికి మ‌రియు మారిష‌స్ కోస్ట్‌గార్డ్‌కు అందించిన సంస్థ‌గా నిలిచింది.1961లో సీవార్డ్ డిఫెన్స్ బోట్ (ఎంకే) రూప‌క‌ల్ప‌న‌తో ప్రారంభ‌మైన జీఆర్ఎస్ఈ ప్ర‌స్థానం నేటి వందో యుద్ధ‌నౌక వ‌ర‌కు అనేక కీల‌క‌మైన ఉత్పాద‌న‌లు అందించింది. 100వ నౌక అయిన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ L-56ను నేడు అందించింది.  మార్చి 27వ తేదీన‌ 99వ యుద్ధ నౌక ఫాస్ట్ పాట్రోల్ వెసెల్‌ను అందించింది.వందవ యుద్ధ‌నౌక‌ లాంఛనంగా` జీఆర్ఎస్ఈ చైర్మ‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ రియ‌ర్ అడ్మిర‌ల్ వీ కే సక్సేనా ఐఎన్ (రిటైర్డ్) ఈ నౌక యొక్క క‌మాండింగ్ ఆఫీస‌ర్ లెఫ్టినెంట్ క‌మాండ‌ర్ గోపినాథ్ నారాయ‌ణ‌న్‌కు జీఆర్ఎస్ఈలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అందించారు. భార‌త నౌకాద‌ళం ఈ నౌక‌ను స్వీక‌రించే ముందు బ్రిగేడియ‌ర్ ఎస్‌వై దేశ్‌ముఖ్, సీఎస్ఓ (టెక్‌), ఏ ఆండ్ ఎన్ తుది త‌నిఖీలు నిర్వ‌హించారు. భార‌త ప్రభుత్వ డిఫెన్స్ సెక్ర‌ట‌రీ సంజ‌య్ మిత్రా ఐఏఎస్‌, వైస్ అడ్మిర‌ల్ బీకే వ‌ర్మ‌, ఏవీఎస్ఎం, ఏడీసీ, క‌మాండ‌ర్ ఇన్ చీఫ్‌, ఏఆండ్ఎన్ క‌మాండ్‌, మినిస్ట్రి ఆఫ్ డిఫెన్స్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ (అక్విజిష‌న్‌) అపూర్వ చంద్ర‌, వైస్ అడ్మిర‌ల్ ఎంఎస్ ప‌వార్‌, ఏవీఎస్ఎం, వీఎస్ఎం, డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావ‌ల్ స్టాఫ్ క‌మాండ‌ర్ ఐబీ ఉత్త‌య్య‌, వీఎస్ఎం, ప్రిన్సిప‌ల్ డైరెక్ట‌ర్ షిప్ ప్రొడ‌క్ష‌న్‌, డైరెక్ట‌ర్ (ఫైనాన్స్‌) శివాజీ సింగ్ దోర్గ‌, డైరెక్ట‌ర్ ప‌ర్స‌నల్ అశిత్ కుమార్ నంద‌, డైరెక్ట‌ర్ షిప్ బిల్డింగ్‌ క‌మాండ‌ర్ సంజీవ్ న‌య్య‌ర్ ఐఎన్‌, (రిటైర్డ్‌)తో పాటుగా జీఆర్ఎస్ఈకి చెందిన సీనియ‌ర్ అధికారులు, భార‌త నౌకాద‌ళానికి చెందిన అధికారులు ఈ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా పాల్గొన్నారు.లాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్‌సీయూ) విభాగానికి చెందిన ఈ యుద్ధ‌నౌక పేరు ఎల్‌సీయూ ఎల్‌56. ఇలాంటి యుద్ధ‌నౌక‌లు ఎనిమిది త‌యారు చేయాల‌ని భార‌త నౌకాద‌శం ఆర్డ‌ర్ ఇచ్చింది. నిర్మాణం పూర్తి చేసి అందించిన వాటిలో ఇది ఆరవ‌ది. మిగిలిన రెండు యుద్ధ‌నౌక‌లు నిర్మాణం జ‌రుగుతున్నాయి మ‌రియు నిర్దేశిత స‌మ‌యానికి డెలివ‌రీ చేయ‌నున్నాం. భార‌త నౌకాద‌ళం నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు ఈ ఎస్‌సీయూ మార్క్4 యుద్ధ‌నౌక‌ను జీఆర్ఎస్ఈలోనే అంత‌ర్గ‌తంగా డిజైన్ చేసి అందించారు. ఉభ‌య‌చ‌ర అవ‌స‌రాల‌కు అనుగుణంగా తీర్చిదిద్దిన ఎల్‌సీయూ ఎంకే-4 యుద్ధ‌నౌక ప్రాథ‌మిక‌ పాత్ర ప్ర‌ధానంగా యుద్ధ‌నౌక‌ల‌ను ర‌వాణా చేయ‌డం, ఆయుధాల వాహ‌నాల‌ను నిర్దేశిత ప్రాంతానికి చేర్చ‌డం, బ‌ల‌గాలు మ‌రియు ప‌రికరాల‌ను నౌక నుంచి సముద్ర తీరానికి చేర్చ‌డం ప్రధాన కార్యాచ‌ర‌ణ‌. అండ‌మాన్ మ‌రియు నికోబార్ వ‌ద్ద అందుబాటులో ఉండే ఈ యుద్ధ నౌక‌లు బ‌హుళ విధ ల‌క్ష్యాల కోసం ఉప‌యోగిస్తారు. తీరానికి సంబంధించిన కార్య‌క‌లాపాలు, గ‌స్తీ మ‌రియు ఆప‌త్కాలంలో ర‌క్షించ‌డం కోసం, విప‌త్తు నిర్వ‌హ‌ణ సంబంధిత చ‌ర్య‌లు, స‌ర‌ఫ‌రా మ‌రియు పున‌రావ‌స కార్య‌క్ర‌మాలు, ద్వీప‌క‌ల్ప ప్రాంతం నుంచి త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ల్లో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఎల్‌సీయూ 63 మీట‌ర్ల పొడ‌వు, 11 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉంది. 830 ట‌న్నుల త‌ర‌లింపు సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. 15 నాట్‌ల వేగంతో ఈ నౌక ప్ర‌యాణించ‌గ‌లదు. 216 మందికి చోటివ్వ‌గ‌లిగిన సామ‌ర్థ్యం క‌ల ఈ యుద్ధ నౌక రెండు దేశీయంగా రూపొందిన‌ సీఆర్ఎన్ 91 గ‌న్‌ల సామ‌ర్థ్యంతో ల్యాండింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించ‌గ‌ల‌దు. ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టం ( ఐబీఎస్‌) మ‌రియు ప్లాట్‌ఫాం మేనేజ్‌మెంట్ సిస్టం (ఐపీఎంఎస్‌) వంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్డ్ సిస్ట‌మ్‌ల‌ను క‌లిగి ఉంది.గ‌తవారంలో, మార్చి 27, 2019న జీఆర్ఎస్ఈ 99వ యుద్ధ నౌక అడ్వాన్స్డ్ ఫాస్ట్ పెట్రోల్ వెసెల్ సామ‌ర్థ్యం క‌లిగిన “ఐసీజీఎస్ ప్రియ‌ద‌ర్శిని“ తీర ర‌క్ష‌క ద‌ళానికి అందించింది. భార‌త తీర ర‌క్ష‌క ద‌ళానికి ఐదు ఫాస్ట్ పెట్రోల్ వెసెల్‌ల‌ను రూపొందించే ఆర్డ‌ర్‌ను సొంతం చేసుకున్న జీఆర్ఎస్ఈ ఇందులో తొలి శ్రేణిలో ఐసీజీఎస్ ప్రియ‌ద‌ర్శినిని అందించింది. మిగిలిన నాలుగు నౌక‌ల రూప‌క‌ల్ప‌న‌ ప్రాథ‌మిక ద‌శ‌లో ఉంది. ఈ ఎఫ్‌పీవీ భార‌త స‌ముద్ర తీర ప్రాంతంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు త‌గిన మీడియం రేంజ్ స‌ర్ఫేస్ రేంజ్ వెసెల్‌. ఉత్త‌మ రీతిలో ఇంధ‌నం ఉపయోగించ‌గ‌ల మ‌రియు మెరుగైన సామ‌ర్థ్యం క‌లిగిన యుద్ధ‌నౌన బ‌హుళ విధ కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ‌కు ఉద్దేశించింది. పెట్రోలింగ్‌, యాంటీ స్మ‌గ్లింగ్‌, యాంటీ పోచింగ్ మ‌రియు రెస్క్యూ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించ‌గ‌ల‌దు. అన్ని ఎఫ్‌పీవీల‌ను భార‌త నౌకాద‌ళం నిర్దేశించిన ప్ర‌మాణాల మేర‌కు జీఆర్ఎస్ఈలోనే అంత‌ర్గ‌తంగా డిజైన్ చేసి అందించారు.ఈ నౌక 50 మీట‌ర్ల పొడ‌వు, 7.5 మీట‌ర్ల వెడ‌ల్పుతో 308 ట‌న్నులు ర‌వాణ చేయ‌గ‌ల సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉంది. ఈ షిప్ 34 నాట్ల గ‌రిష్ట వేగంతో ప్ర‌యాణించ‌గ‌ల‌దు 1500 నాటిక‌న్ మైల్లు ఏక‌కాలంలో ప్ర‌యాణించ‌గ‌ల‌దు. ఇందులో అడ్వాన్డ్స్ కంట్రోల్ సిస్టం క‌లిగి మూడు ప్ర‌ధాన‌ ఇంజిన్ల‌తో పాటుగా , వాట‌ర్ జెట్ యూనిట్లు మ‌రియు క‌మ్యూనికేష‌న్, నావేగ‌ష‌న్ కోసం ఉద్దేశించిన‌ `ఇంటిగ్రేటెడ్ బ్రిడ్జ్ సిస్టం` ఉంది. ఈ నౌక‌లో 40/60 తుపాకుల యుద్ధ‌సామాగ్రితో పాటుగా 35 మందికి చోటివ్వ‌గ‌లిగిన పూర్తి ఎయిర్‌కండిష‌న‌ర్ మాడ్యుల‌ర్ వ‌స‌తి ఉంది. `ఐసీజీఎస్ ప్రియ‌ద‌ర్శిని`ని అందించ‌డంతో పాటుగా ఐఎన్ ఎల్‌సీయూ ఎల్ 56 ద్వారా జీఆర్ఎస్ఈ మ‌రోమారు భార‌త‌దేశం తీర ప్రాంతంపై యొక్క ర‌క్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్న తీరును మ‌రోమారు స్ప‌ష్టం చేసింది. ఈ మినీ ర‌త్న షిప్‌యార్డ్‌పై దేశం పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని మ‌రోమారు ఫ‌లితం రూపంలో అందించింది. ఈ సంద‌ర్భంగానే జీఆర్ఎస్ఈ త‌న వినియోగ‌దారుల‌కు అందించే ఎండ్‌-టు-ఎండ్ సొల్యూష‌న్స్‌, వినియోగ‌దారులు అవ‌స‌రాల‌కు త‌గిన రీతిలో ఉత్ప‌త్తుల‌ను అందించ‌డం, డిజైన్, సిస్టం ఇంటిగ్రేష‌న్ మ‌రియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ వంటి అంశాల‌లో త‌న నైపుణ్యాత‌ను చాటుకోవ‌డంతో పాటుగా పెరుగుతున్న వినియోగ‌దారుల డిమాండ్‌కు త‌గు సేవ‌లు అందిస్తోంది.ప్ర‌స్తుతం జీఆర్ఎస్ఈ వ‌ద్ద దాదాపు 21,700 కోట్ల ఆర్డ‌ర్లు ఉన్నాయి. త‌ద్వారా ఆదాయం స‌మ‌కూర్చ‌గ‌ల ప్రాజెక్టుల‌ను సంస్థ క‌లిగి ఉంది. 5 ప్రాజెక్టులు, 14 నౌక‌ల నిర్మాణం మ‌రియు 4 స‌ర్వే వెసెల్స్ (పెద్ద‌వి) నిర్మాణాన్ని పోటీ ద్వారా సొంతం చేసుకున్న జీఆర్ఎస్ఈ ప్ర‌స్తుతం వాటిని నిర్మిస్తోంది. భార‌త నౌకాద‌ళం అవ‌స‌రాల కోసం  నౌక‌ల‌ను నిర్మించేందుకు దాఖ‌లు చేసిన బిడ్ల‌లో నిర్మాణం అవ‌కాశాన్ని జీఆర్ఎస్ఈ సొంతం చేసుకుంది.భార‌త నౌకాద‌ళంతో జీఆర్ఎస్ఈకి ఆరు ద‌శాబ్దాలుగా బ‌ల‌మైన అనుబంధం ఉంది. యుద్ధ నౌక‌లు మ‌రియు ఇత‌ర నౌక‌ల‌ను దేశ తీర ప్రాంత అవ‌స‌రాల కోసం జీఆర్ఎస్ఈ నిర్మించి ఇస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 100 యుద్ధ నౌక‌ల‌ను విజ‌య‌వంతంగా నిర్మించిన జీఆర్ఎస్ఈ, దేశంలోనే అతి ఎక్కువ యుద్ధ నౌక‌ల‌ను నిర్మించిన సంస్థ‌గా గుర్తింపు పొందింది. 100 యుద్ధ నౌక‌ల‌లో 67 భార‌త నౌకాద‌ళం కోసం కాగా అవి వివిధ శ్రేణులు మ‌రియు సామ‌ర్థ్యాలు క‌లిగిన‌వి. ఫ్రైగేట్స్‌, మిస్సైల్ కోర్వెట్లు, యాంటీ స‌బ్‌మెరైన్ వార్‌ఫేర్ కొర్వెటెలు, ఫ్ల‌ట్ ట్యాంక‌ర్లు, ల్యాండింగ్ షిప్ ట్యాంక్‌లు, ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీలు, ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్స్ మ‌రియు ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ వంటి శ‌క్తివంత‌మైన ఉత్ప‌త్తుల‌ను అందించింది. త‌న మౌలిక స‌దుపాయాల‌ను అధునాత‌నంగా తీర్చిదిద్దుకోవ‌డం భాగంగా జీఆర్ఎస్ఈ గ‌త ప‌ది సంవ‌త్స‌రాల కాలంలో రూ.605 కోట్ల‌ను ఇంటిగ్రేటెడ్ షిప్‌బిల్డింగ్ ఫెసిలిటీ కోసం ఖ‌ర్చు చేసి 20 నౌక‌ల‌ను నిర్మించే సామ‌ర్థ్యాన్ని సొంతం చేసుకుంది.గ‌త 59 సంవత్స‌రాలుగా, 780 నౌక‌ల‌ను జీఆర్ఎస్ఈ త‌యారు చేయ‌గా ఇందులో 100 యుద్ధ‌నౌక‌లు భార‌త నౌకాద‌ళం, భార‌త తీర ర‌క్ష‌క ద‌ళం మరియు మారిష‌స్ ప్ర‌భుత్వం కోసం అధిక సంఖ్య‌లో రూపొందించి అందించింది. 5 ట‌న్నుల బోట్లు మ‌రియు 24,600 ట‌న్నుల విమాన ట్యాంకర్ల సామ‌ర్థ్యం క‌లిగిన రూపొందించగ‌లిగే సామర్థ్యాన్ని జీఆర్ఎస్ఈ రూపొందించింది. దేశం కోసం కావాల్సిన యుద్ధ నౌక‌ల‌ను రూపొందించే విశిష్ట సంస్థ‌గా జీఆర్ఎస్ఈ నిల‌దొక్కుకుంది.22నెల‌ల వ్య‌వ‌ధి (జూన్ 17 నుంచి మార్చి 19)లోనే 8 యుద్ధ నౌక‌ల‌ను అందించిన జీఆర్ఎస్ఈ మ‌రే సంస్థకు సాధ్యం కాని విశిష్ట‌త‌ను సొంతం చేసుకుంది. నౌకాయానానికి చెందిన ఆర్ ఆండ్ డీ విభాగం భార‌త‌దేశ శాస్త్ర సాంకేతిక శాఖ‌ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండ‌స్ట్రీయ‌ల్ రీసెర్స్ (డీఎస్ఐఆర్) గుర్తింపు పొందింది. 100 మందికి పైగా విశిష్ట‌మైన నైపుణ్య‌వంతులైన డిజైన్‌టీం ఇంజినీర్ల బృందం భార‌త‌దేశం యొక్క నౌకాద‌ళం, తీర ర‌క్ష‌క ద‌ళం యొక్క ప్ర‌స్తుత‌, భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన నౌక‌ల‌ను రూపొందించే క్ర‌మంలో నిత్యం నిమ‌గ్న‌మై ఉంటూ జీఆర్ఎస్ఈని మారిటం ఇంజినీరింగ్ ఎక్స్‌లెన్స్‌లో ఉన్న‌త స్థానంలో నిలుపుతున్నారు. ప్ర‌పంచ శ్రేణి లీడ‌ర్‌గా ఎద‌గాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతూ విశిష్ట వృద్ధిని సొంతం చేసుకుంటున్న జీఆర్ఎస్ఈ, వీఓపీ రంగంలో రాబోయే 4-5 సంవత్స‌రాల కాలంలో త‌న స‌త్తా చాటుకోవాల‌ని ముందుకు సాగుతోంది. నూత‌న టెక్నాల‌జీలు అయిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్‌, డాటా అన‌లిటిక్స్ ద్వారా సంస్థ యొక్క అంత‌ర్గ‌త సామ‌ర్థ్యాన్ని పెంచుకోవ‌డం, లాభాల ఆర్జ‌న‌ను వృద్ధి చెందించ‌డంపై దృష్టి సారించింది. నిరంతరం ప‌రిశోధ‌న‌లు మ‌రియు అభివృద్ధి అంశాల‌పై దృష్టి సారించ‌డం, ఉత్త‌మ‌మైన ప్రొడ‌క్ట్ క్వాలిటీ, స్వ‌యంగా ఎద‌గ‌డం, అత్యుత్త‌మ‌మైన మాన‌వ వ‌న‌రులు అండ‌గా బ‌ల‌మైన కార్పొరేట్ స్ట్ర‌క్చ‌ర్ ఉండ‌టం వ‌ల్ల జీఆర్ఎస్ఈ రాబోయే కాలంలో ఉజ్వ‌ల‌మైన భ‌విష్య‌త్‌ను అందించ‌నుంది.

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26070
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author