పవన్ కు గడ్డం సెంటిమెంట్

పవన్ కు గడ్డం సెంటిమెంట్
April 04 13:34 2019

సినిమాల మాదిరిగానే రాజకీయాల్లోనూ పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి భిన్నంగా ఉంటుంది. ఆయన ప్రసంగాలు, వేషధారణ… మిగతా నాయకుల కంటే డిఫరెంట్ అనే విషయం ఆయనను ఫాలో అయ్యేవారందరికీ అర్థమవుతోంది. తాజా ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ పొడవాటి గడ్డంతో కాస్త భిన్నగా కనిపిస్తున్నారు. గడ్డం పెంచడం పవన్ కళ్యాణ్‌కు కొత్తేమీ కాదు. గతంలో అనేకసార్లు గడ్డం పెంచి సరికొత్త లుక్‌లో కనిపించారు జనసేన అధినేత. అయితే ఎన్నికల సందర్భంగా గడ్డం పెంచడం వెనుక మాత్రం ఆయన ఓ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇదే తరహా సెంటిమెంట్‌ను పవన్ కళ్యాణ్ పాటించారని… అప్పుడు ఆయనను విజయం వరించిందనే టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచిన పవన్ కళ్యాణ్… వారితో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనూ పవన్ కళ్యాణ్ గడ్డంతో కనిపించారు. ఇప్పుడున్న రేంజ్‌లో కాకపోయినా… గడ్డంతో ఉన్న లుక్‌లోనే అప్పుడు పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఎన్నికలు పూర్తయ్యేంతవరకు అదే లుక్‌ను కంటిన్యూ చేసిన పవర్ స్టార్… ఫలితాలు వెలువడిన తరవాత మళ్లీ తన రెగ్యూలర్ లుక్‌లోకి మారిపోయారు. అలా తన గడ్డం అప్పట్లో టీడీపీ, బీజేపీ కూటమికి కలిసొచ్చిందని భావిస్తున్న పవన్ కళ్యాణ్… ఈ సారి తన లుక్ తన సొంత పార్టీ అయిన జనసేనకు విజయాన్ని తెచ్చిపెడుతుందనే భావనలో ఉన్నారని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి గతంలో పవన్ కళ్యాణ్‌కు కలిసొచ్చిన గడ్డం సెంటిమెంట్… ఈ సారి కూడా వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే మే 23 వరకు వెయిట్ చేయాల్సిందే

Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=26186
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Categories:
view more articles

About Article Author